హిట్ మెషీన్ ఆ ఇద్ద‌రిని ఫిక్స్ చేశాడుగా!

బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటున్న హిట్ మెషీన్ అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి రేస్‌ని కూడా బుక్ చేసుకున్నాడు.;

Update: 2026-04-22 17:30 GMT

బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటున్న హిట్ మెషీన్ అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి రేస్‌ని కూడా బుక్ చేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ మూవీ `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు`. ఫ్యామిలీ ఎమోష‌న్‌ని ప్ర‌ధానంగా తీసుకుని దానికి త‌న‌దైన మార్కు హాస్యాన్ని, యాక్ష‌న్‌ని జోడించి తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. చిరు కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్లు రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది. ఈ స్థాయిలో ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన తెలుగు సినిమాగా సరికొత్త రికార్డుని నెల‌కొల్పింది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌తో కొంత రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయిన అనిల్ రావిపూడి ప్రస్తుంతం త‌న త‌దుప‌రి మూవీకి రెడీ అయిపోతున్నాడు.

ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోలుగా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత సాహు గార‌పాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌పైకి రానున్న ఈ మూవీ కోసం ఇద్ద‌రు హీరోయిన్‌ల పేర్లు గ‌త కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా వారిని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఫైన‌ల్ చేసేశార‌ని తెలిసింది.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్‌లు మ‌రెవ‌రో కాదు.. ఒక‌రు కీర్తి సురేష్‌, మ‌రొక‌రు కృతిశెట్టి. ఈ ఇద్ద‌రిలో కీర్తి సురేష్‌ని వెంకీకి జోడీగా తీసుకోగా, క‌ల్యాణ్ రామ్‌కు జోడీగా కృతిశెట్టిని ఫైన‌ల్ చేశార‌ని మూవీ టీమ్ వెల్ల‌డించింది. త‌న‌కు క‌లిసొస్తున్న ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని జోడించి త‌న మార్కు కామోడీతో ఈ సినిమాని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే ముందుగా హీరోయిన్‌ల‌ని ఫైన‌ల్ చేసిన అనిల్ జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని అనిల్ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. వెంకీ మామ‌తో అనిల్ కిది ఐద‌వ సినిమా. క‌ల్యాణ్ రామ్ కిది రెండ‌వ మూవీ. ఎఫ్ 2 త‌ర‌హాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

Tags:    

Similar News