త‌మ‌న్నా మాజీ ప్రియుడు కొత్త భామ‌తో డేటింగ్!

విజ‌య్ వ‌ర్మ -త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అటుపై వీగిపోవిడం తెలిసిందే. కొంత కాలం పాటు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలిన జోడీ బాండింగ్ చూసి పెళ్లి చేసుకుంటార‌నుకున్నారంతా.;

Update: 2026-04-22 14:52 GMT

విజ‌య్ వ‌ర్మ -త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అటుపై వీగిపోవిడం తెలిసిందే. కొంత కాలం పాటు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలిన జోడీ బాండింగ్ చూసి పెళ్లి చేసుకుంటార‌నుకున్నారంతా. కానీ ఆ బంధం అంత వ‌ర‌కూ వెళ్ల లేదు. మ‌న‌స్ప‌ర్ద‌లు కార‌ణంగా విడిపోయారు. అటుపై ఇరువురు ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా విజయ్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ముంబైలో విజ‌య్, నటి ఆలియా ఖురేషితో కలిసి కనిపించడం బి-టౌన్‌లో కొత్త చర్చకు దారితీసింది. ఇద్ద‌రు క‌లిసి ఒకే చోట కనిపించడంతో విజయ్ వర్మ కొత్త డేటింగ్ మొదలుపెట్టారా? అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి.

ముంబైలోని ఓ ప్రైవేట్ ప్రదేశంలో విజయ్ వర్మ -ఆలియా ఖురేషి కెమెరాలకు చిక్కారు. ఆలియా ఖురేషి ఇటీవల విజయ్ వర్మ నటించిన `మట్కా కింగ్` సిరీస్‌లో కూడా భాగమైంది. షూటింగ్ సమయంలో ఇద్ద‌రి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారిందని అదే డేటింగ్‌కు దారితీసి ఉండొచ్చ‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇద్ద‌రు కేవలం స్నేహితులుగా లేదా సినిమా ప్రమోషన్ల కోసం కలిశారా? అనే విషయంలో స్పష్టత లేదు. విజయ్ వర్మ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. గతంలో తమన్నాతో ఉన్న రిలేషన్‌షిప్‌ను కూడా చాలా కాలం తర్వాతే అధికారికంగా ధృవీకరించారు.

తాజాగా ఆలియాతో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో ఎన్నో ర‌కాలుగా చర్చించుకుంటున్నారు.ఆలియా ఖురేషి వర్ధమాన నటిగా బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. షారుఖ్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం `జవాన్`లో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు 2022లో రిలీజ్ అయిన `ఎక్స్` అనే వెబ్ సిరీస్‌లో కూడా తన నటనతో మెప్పిం చింది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటనతో కెరీర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఆమె బిజీగా ఉంది. మ‌రి ఈ రూమ‌ర్ వార్త అమ్మ‌డి కెరీర్ పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

సెలబ్రిటీలు కలిసి కనిపించినప్పుడల్లా డేటింగ్ వార్తలు రావడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. విజయ్ వర్మ ,ఆలియా ఖురేషి ఈ పుకార్లపై స్పందిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. అప్పటి వరకు ఈ కొత్త జోడీ చుట్టూ జరుగుతోన్న ప్రచారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. విజ‌య్ వ‌ర్మ మాత్రం ఏ భౄష‌లో అవ‌కాశం వ‌చ్చినా కాద‌నుకుండా ప‌ని చేస్తున్నాడు. కెరీర్ లో ఇంకా వైవిథ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఆశీస్తున్నాడు. కానీ తాను కోరుకున్న రోల్స్ మాత్రం ఇంకా రావ‌డం లేద‌ని ఇటీవ‌లే ఓ మీట్ లో అన్నాడు.

Tags:    

Similar News