ప్ర‌భాస్ క‌ల్కి2కి టైటిల్ ఫిక్స్ చేశారా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `క‌ల్కి 2898ఏడీ`. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో వైజ‌యంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత‌కంగా రూపొంది బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్లని రాబ‌ట్టింది.;

Update: 2026-04-22 18:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `క‌ల్కి 2898ఏడీ`. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో వైజ‌యంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత‌కంగా రూపొంది బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్లని రాబ‌ట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల‌కు పైనే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సీక్వెల్‌పై అంచ‌నాల్ని పెంచేసింది. దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలోని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అశ్వ‌ద్ధామ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుప్రీం యాస్కిన్‌గా క‌మ‌ల్ హాస‌న్‌, మ‌రియ‌మ్‌గా శోభ‌న‌, రూమీగా రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌ర‌లు న‌టించారు.

భూమిపై ప్ర‌ధాన న‌గ‌రం, క‌లియుగాతం స‌మ‌యంలో భూమిపై చివ‌రి న‌గ‌రం కాశీ నేప‌థ్యంలో.. శంభాల‌..దేవుడి ఆగ‌మ‌నం వంటి డివోష‌న‌ల్ ఎలిమెంట్స్‌తో క‌ల్కీ అవ‌తారం పుట్ట‌క‌, దాని చుట్టూ జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌ని చూపిస్తూ ఓ ఫిక్ష‌న‌ల్ సైన్స్ థ్రిల్ల‌ర్‌గా దీన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరు, సినిమా ప్రారంభంలో కురుక్షేత్ర సంగ్రామం..సినిమా చివ‌ర్లో అర్జునుడు, క‌ర్ణుడు అశ్వ‌ద్ధామ కోసం యుద్ధం చేయ‌డం..వంటి అంశాల‌ని చూపిస్తూ ప్రేక్ష‌కుల్ని ఆ నాటి కాలానికి తీసుకెళ్లింది.

ఇక సుప్రీమ్ యాస్కిన్‌గా క‌మ‌ల్ హాస‌న్ పూర్తి స్థాయి పాత్ర‌ని పార్ట్ 1లో చూపించ‌లేదు. క‌ల్కిగా ప్ర‌భాస్ న‌ట విశ్వ‌రూపాన్ని కూడా ప్ర‌ద‌ర్శించ‌లేదు. వీరికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని పార్ట్ 2లో చూపించ‌బోతున్నాన‌ని ద‌ర్శ‌కుడు హింట్ ఇవ్వ‌డంతో పార్ట్ 2పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ మొద‌లైంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సిటీ శివార్ల‌లో శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. కీల‌కమైన ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ కోసం మేక‌ర్స్ హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ సెట్‌ని ఏర్పాటు చేశారు.

అక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని భారీ ఎత్తున చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది. తాజాగా వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌రించే కీల‌క స‌న్నివేశాల్లో క‌మ‌ల్ హాస‌న్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌తో పాటు ప్ర‌భాస్ కూడా పాల్గొంటార‌ని స‌మాచారం. అంతే కాకుండా ఈ సీక్వెల్‌లో పురాణ ఇతిహాసాల‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాలు అధికంగా ఉంటాయ‌ని, ఇవి ప్రేక్ష‌కుల్ని సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తార‌ని ఇన్ సైట్ టాక్‌. క‌ల్కి పుట్టుక‌కు సంబంధించిన ప్ర‌ధాన ఘ‌ట్టాలు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో ప్ర‌భాస్ క్యాక్ట‌ర్ చాలా ప‌వర్ ఫుల్‌గా ఉంటుంద‌ని, క‌ల్కి అవ‌తారంలో ప్ర‌భాస్‌పై వ‌చ్చే స‌న్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల క‌థ‌నం. ఇక ఈ మూవీకి `క‌ర్ణ 3102 BC` అనే టైటిల్‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఫిక్స్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే ఈ టైటిల్ నిజ‌మైతే పార్ట్ 3ని కూడా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఏడాది అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముంద‌కు రానున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News