సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో సినిమా,,,

Update: 2015-12-23 12:15 GMT
దర్శకుడిగా విజయం సాధించి మంచి ఫామ్ లో వున్న తరుణంలో తిరిగి రచయితగా మారి ఆ స్క్రిప్ట్ ని తానే నిర్మించి చిన్న హీరోలతో హిట్ కొట్టడం పెద్దమాటే. అయితే సుకుమార్ రైటింగ్స్ పేరిట కుమారి 21F పేరుతొ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఫీట్ ని సాధించాడు.

దర్శకుడి కంటే రచయితగా ఎక్కువ తృప్తి పొందుతానని తెలిపిన సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వడంతో సుకుమార్ రైటింగ్స్ నుండి మరో స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ కి "డైరెక్టర్" అనే టైటిల్ ని పెట్టినట్టు సమాచారం.

సినేమలైతే లేట్ చెయ్యాలి గానీ సుక్కూ దగ్గర కధలు కోకొల్లలు వున్నాయని దేవి సభాముఖంగా చెప్పాడు. అందుకే కుమారి విడుదలైన తక్కువ కాలంలోపే మరో ప్రాజెక్ట్ కి నాంది పలికినట్టు సమాచారం. ఈ డైరెక్టర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
Tags:    

Similar News