మహేష్‌ ను మోసం చేశా- సుకుమార్

Update: 2016-01-13 04:28 GMT
మహేష్ బాబు లాంటి హీరోతో పని చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినపుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ సుకుమార్ అలా చేయలేకపోయాడు. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. సినిమాకు మంచి పేరైతే వచ్చింది కానీ.. కమర్షియల్ గా మాత్రం దారుణమైన ఫలితం వచ్చింది. మహేష్ కు ఆ సినిమా ఓ చేదు జ్నాపకంగా మిగిలిపోయింది. అయినప్పటికీ సుకుమార్ గురించి కానీ, ఆ సినిమా గురించి కానీ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడలేదు మహేష్. బహుశా ప్రిన్స్ ఇలా వ్యవహరించడం సుక్కుని మరింత గిల్టీగా ఫీలయ్యేలా చేసిందేమో.

ఐతే ఇంతకుముందెన్నడూ ‘1 నేనొక్కడినే’ గురించి పెదవి విప్పని సుక్కు.. తన కొత్త సినిమా ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ సందర్భంగా దాని ప్రస్తావన తెచ్చాడు. తనను ఎంతో నమ్మి మహేష్ ఛాన్సిస్తే సరైన సినిమా ఇవ్వలేకపోయానని సుక్కు పశ్చాత్తాప పడ్డాడు. ‘‘1 నేనొక్కడినే ఫలితం వల్ల అందరి కంటే నేనే ఎక్కువ నిరాశ చెందాను. మహేష్ బాబు, నిర్మాతలు నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. కానీ నేను వాళ్ల అంచనాలకు తగ్గ సినిమా ఇవ్వలేకపోయాను. ఒక ఫెయిల్యూర్ సినిమా ఇచ్చాను. నేను మహేష్ బాబుని మోసం చేశానన్న భావన కలిగింది. మహేష్ మళ్లీ నాకో అవకాశం ఇస్తే.. ఒక పాథ్ బ్రేకింగ్ మూవీ చేసి హిట్టు కొట్టాలన్నది నా లక్ష్యం’’ అని సుకుమార్ చెప్పాడు.
Tags:    

Similar News