కేక్ క‌ట్ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు

Update: 2015-11-21 05:21 GMT

సుక్కూ నిరీక్ష‌ణ ఫ‌లించింది. సొంత బ్యాన‌ర్‌లో కుమారి -21 ఎఫ్ మూవీ నిర్మించి విజ‌యం అందుకున్నాడు. తొలి ప్ర‌య‌త్న‌మే యూత్‌ కి గాలం వేసి థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఎటెంప్ట్ స‌క్సెసైంది. ఈ మూవీలో యూత్‌కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయ‌న్న టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా అస‌లు హీరోయిన్ బాలేదు అన్న నెగెటివ్ టాక్ ప్ర‌చారం చేసిన వారికి దిమ్మ‌తిరిగే ట్రీట్ ఇచ్చింది హేబా ప‌టేల్‌. ఈ ముంబై పోరి సోలోగా సినిమాని ర‌న్ చేసేసింద‌న్న టాక్ వ‌చ్చింది. హేబాతో పాటు రాజ్‌ త‌రుణ్ పెర్ఫామెన్స్‌ కి క్రిటిక్స్ మంచి మార్కులే వేశారు. క్ల‌యిమాక్స్ ముందు స‌న్నివేశాల‌కు 200 శాతం మార్కులేశారు న‌యా క్రిటిక్స్‌.

అందుకే ఈ సినిమా హిట్టు అన్న ప్ర‌చారం రావ‌డంతో సుక్కూ పండ‌గ చేసుకున్నాడు. హైద‌రాబాద్ మ‌ణికొండ‌లోని సుకుమార్ రైటింగ్స్  (సొంత ఆఫీసు) కార్యాల‌యంలో చిత్ర‌యూనిట్ తో పాటు స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. ఒక‌రికొక‌రు కేక్ తినిపించుకుంటూ ఆలింగ‌నాల కార్య‌క్ర‌మం సాగిన తీరును ఫోటోల రూపంలో రిలీజ్‌ చేశారు సుక్కూ టీమ్‌. ఈ హ‌డావుడి స‌రే సుక్కూకి అస‌లైన అగ్ని ప‌రీక్ష ముందుంది. ఇక నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంతో విజ‌యం అందుకోవాల్సి ఉంది. ఈ మూవీ అటు ఎన్టీఆర్‌ కి, ఇటు సుక్కూకి అగ్ని ప‌రీక్ష లాంటిదే.  టెంప‌ర్ లాంటి రేసీ హిట్ కొట్టాక ఆ ట్రాక్‌ ని కొన‌సాగించే బాధ్య‌త ఎన్టీఆర్‌ కి ఉంది. అలాగే 1 నేనొక్క‌డినే లాంటి ఫ్లాప్ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా తిరిగి  రేసులోకి రావాల్సిన క్రిటిక‌ల్ టైమ్‌ కూడా ఇదే.
Tags:    

Similar News