డాక్టరేట్ అందుకున్న స్టార్ యాక్టర్!!
సౌత్ ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. హీరోగా కెరీర్ ప్రారంభించిన మాధవన్ ప్రస్తుతం సాలిడ్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మాధవన్ పేరు వింటే 1995-2005 టైంలో లవర్ బాయ్ గా ఫేమస్. ఆయనకు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే మాధవన్ ఓ పక్క నటన కొనసాగిస్తూనే మరోవైపు డైరెక్షన్, ప్రొడక్షన్, రైటింగ్, సింగింగ్ ఇలా అన్నింట్లోను తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా చిత్రపరిశ్రమలో మాధవన్ అందించిన సేవలకు గాను మహారాష్ట్రలోని కోల్హాపుర్ డీవై పాటిల్ యూనివర్సిటీ ఆయనను గౌరవడాక్టరేట్తో సత్కరించింది. ఈ పురస్కారం తనకు అందించడంతో మాధవన్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసాడు.
ఇలాంటి పురస్కారం నాకు మరిన్ని వినూత్న పాత్రలు పోషించేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. మాధవన్ అసలు పేరు మాధవన్ బాలాజీ రంగనాథన్. 1970లో పుట్టిన మాధవన్.. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా చాలా భాషల్లో నటించాడు. మాధవన్ బాలీవుడ్‌లో ‘ఇస్ రాత్ కీ సుభా నహి’ సినిమాలో ఓ పాటపాడాడు. అనంతరం ‘ఇన్‌ఫెర్నో’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించాడు. అయితే పరిశ్రమకు వచ్చిన వెంటనే మల్టీలాంగ్వేజెస్ లో అవకాశాలను అందుకున్నాడు. బాలీవుడ్ లో ‘3 ఇడియట్స్’ మూవీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి చెలీ, సఖి లాంటి లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ గా పాపులర్ అయ్యాడు. ఇటీవలే నిశ్శబ్దం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.