గ్లామర్ తో మతులు పోగోడుతున్న సుందరవల్లి!
ఇకపోతే తాజాగా సుందరవల్లి గెటప్ లో తన అందంతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ లెహంగా ధరించి టాప్ స్లీవ్ లెస్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.;
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎంతోమంది సెలబ్రిటీలు పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా.. తమ సినిమాలను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అందాలు ఆరబోస్తూ తమ పాత్రలను రివీల్ చేస్తూ తమ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ కి.. ఆడియన్స్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ తన పాత్ర పేరుతో అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. తన సినిమా టీజర్ కి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు మంత్రముగ్ధులైన ఆమె.. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఫోటోలతో పాటు స్పెషల్ గా ధన్యవాదాలు కూడా తెలియజేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ యంగ్ బ్యూటీ నభా నటేష్. తాజాగా ఈమె నిఖిల్ సిద్ధార్థ 'స్వయంభు' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సుందరవల్లి పాత్రలో నటిస్తున్నట్లు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ తో పాటు సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఈ సినిమా టీజర్ ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో పైగా ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ మీ సుందరవల్లి వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు స్పెషల్ విషెస్ తెలియజేస్తోంది. స్వయంభు టీజర్ కి అందించిన ఆదరణకు ధన్యవాదాలు అంటూ తెలియజేసింది.
ఇకపోతే తాజాగా సుందరవల్లి గెటప్ లో తన అందంతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ లెహంగా ధరించి టాప్ స్లీవ్ లెస్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. గ్లామర్ విందు వడ్డిస్తూ యువతకు ఊపిరాడకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే వాలెంటైన్స్ డే సందర్భంగా నభా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. ఇదే విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ.. ఈ రోజుల్లో ఒక్క సీన్ పర్ఫెక్ట్ గా లేకపోయినా ప్రేక్షకులు క్షమించడం లేదు. విఎఫ్ఎక్స్ లో జరిగే ఒక్క తప్పు స్నోబాల్ ఎఫెక్ట్ లా సినిమాని చుట్టేస్తోంది. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ అనేది అటు నిర్మాత.. ఇటు నిర్మాణ సంస్థ చేతుల్లో ఉండడం లేదు .. అందరూ కూడా హిట్ సినిమానే కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి సీజీ షాట్స్ సరిగ్గా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాను ఎన్ని ఏళ్ళు తీశామన్నది ప్రేక్షకులు చూడరు ఎంత బాగా తీశామన్నదే చూస్తారు.. అందుకే సినిమాను ఆలస్యంగా విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సినిమాపై అంచనాలను పెంచుతూ వి ఎఫ్ ఎక్స్ పై భారీగా కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది చిత్ర బృందం. మరి నబా నటేష్ సుందరవల్లి పాత్రలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.