కుర్రహీరో హిట్టుతో ప్రభాస్ ఫుల్ హ్యాపీ!
టాలీవుడ్‌లో టాలెంట్ ఉండి కూడా సరైన బ్రేక్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే హీరోలు చాలా మంది ఉంటారు. సంతోష్ శోభన్ కూడా ఆ లిస్టులో ఉన్నాడు. నటుడిగా ప్రతి సినిమాలో తన బెస్ట్ ఇస్తున్నా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ మాత్రం అతనికి అందని ద్రాక్షలా ఊరిస్తోంది. ఓటీటీలో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ మెప్పించినా, థియేటర్లలో ఒక సాలిడ్ హిట్ పడితేనే కదా ఆ కిక్కు వేరేలా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఇప్పుడు ఆ లోటును తీర్చేలా కనిపిస్తోంది.
ఈ సినిమా సక్సెస్ సంతోష్ కంటే ఎక్కువగా ఒక వ్యక్తికి చాలా స్పెషల్ అని చెప్పాలి. అతనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా తన పాత రోజులను, తనకు లైఫ్ ఇచ్చిన వ్యక్తులను ప్రభాస్ ఎప్పుడూ మర్చిపోడు. అందుకే సంతోష్ శోభన్ కెరీర్ విషయంలో ప్రభాస్ ఎప్పుడూ ఒక అన్నయ్యలా వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే యువి క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లలో సంతోష్‌కు అవకాశాలు వచ్చేలా ప్రభాస్ బ్యాకప్ ఇస్తూ వచ్చాడు.
ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘వర్షం’ సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకే ఈ సంతోష్ శోభన్. ప్రభాస్‌కు ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన ఆ దర్శకుడు అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబాన్ని ప్రభాస్ తన సొంత ఫ్యామిలీలా చూసుకుంటున్నాడు. తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొడుకు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రభాస్ మనస్పూర్తిగా కోరుకుంటున్నాడు. అందుకే సంతోష్ సినిమా వస్తుందంటే చాలు తన వంతుగా ప్రమోషన్ చేస్తూ అందరికీ రికమెండ్ చేస్తుంటాడు.
ప్రభాస్ ఇచ్చిన ఆ భరోసాతోనే సంతోష్ ఇన్ని రోజులు వరుసగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇప్పటికే ‘మ్యాడ్’ సిరీస్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చి బిజీ అయిపోయాడు. కానీ పెద్దన్నగా సంతోష్ మాత్రం కమర్షియల్ సక్సెస్ కోసం కాస్త ఎక్కువ కాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చేది. ఫైనల్‌గా ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ కంటెంట్ యూత్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మంచి సౌండ్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో లివిన్ రిలేషన్ షిప్, నేటితరం ప్రేమల్లో ఉండే కాంప్లికేషన్లను చాలా రియలిస్టిక్ గా చూపించారు. కేవలం మసాలా కోసమే కాకుండా ఎమోషన్స్ కూడా పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘ఎ’ సర్టిఫికేట్ ఉన్నా కూడా కథలోని నిజాయితీ సినిమాను కాపాడుతోందని మేకర్స్ నముతున్నారు. సంతోష్ శోభన్ నటనలో పరిణతి, మానస వారణాసి గ్రేస్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్లుగా మారాయి.
సంతోష్ శోభన్ కు కమర్షియల్ హిట్ పడితే ప్రభాస్ అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఫీలవుతాడనడంలో సందేహం లేదు. ‘వర్షం’ సినిమాతో మొదలైన ఆ అనుబంధం, ఇప్పుడు శోభన్ వారసుడి సక్సెస్‌తో ఒక పరిపూర్ణతను అందుకున్నట్టే. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో సంతోష్ ఇకపై కూడా ఇంట్రెస్టింగ్ కథలతో తన మార్క్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభాస్ వెయిట్ చేస్తున్న ఆ సక్సెస్ మూమెంట్ ఇన్నాళ్లకు ‘కపుల్ ఫ్రెండ్లీ’ రూపంలో వచ్చినట్టు కనిపిస్తోంది.