పెద్ది సినిమా వివాదం.. జాన్వీ కపూర్ కీలక నిర్ణయం.. ఇక ఆ సినిమా చేయనంటూ షాక్!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో గతంలో ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై జాన్వీ స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తప్పును అంగీకరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఇప్పటికే దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ఆ తర్వాత పెద్ది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే... అయితే సినిమాలో ఆమె పాత్రను చూపించే విధానంపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తాజాగా బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో ఈ వివాదం గురించి జాన్వీ మాట్లాడారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక నటిగా తనకూ బాధ్యత ఉందని, ఏదైనా సన్నివేశం అభ్యంతరకరంగా అనిపిస్తే దానిపై మాట్లాడాల్సిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇతరులను నిందించడం కంటే తనవంతుగా ఏం చేయాల్సిందో ఆలోచించడం ముఖ్యమని జాన్వీ తెలిపారు.
ఇదిలా ఉంటే, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాకు దేశీ వెర్షన్ తీస్తే అందులో ఏ హీరోతో నటిస్తారని జాన్వీని అడిగినప్పుడు, పెద్ది సినిమా అనుభవం తర్వాత అలాంటి సినిమా చేయనని ఆమె చెప్పక వచ్చారు.
ఒక సినిమాలో తప్పు ఉంది అంటే అది దర్శకుడు అలానే హీరోయిన్ ఇద్దరి పైన ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో జాహ్నవి తన తప్పు ఒప్పుకొని ఇలా మాట్లాడటం.. చాలామందికి పాజిటివ్‌గా అనిపించింది. ఒక హీరోయిన్ తన తప్పు ఒప్పుకోవడం చాలా మంచి విషయమని అందరూ కామెంట్లు పెడుతున్నారు.
మరి భవిష్యత్తులో జాన్వి ఇలాంటి సినిమాలు కాకుండా మంచి స్క్రిప్టులు ఎంచుకొని తెలుగులో మంచి పేరు తెచ్చుకుంటుందేమో వేచి చూడాలి.