వాలెంటైన్స్ డే స్పెషల్: అప్పుడే పెళ్లి అంటూ మృణాల్ క్లారిటీ!

ఏది ఏమైనా తన పెళ్లి గురించి తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పడంతో ఇకపై ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. అవన్నీ ఫేక్ అండ్ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.;

Update: 2026-02-14 12:07 GMT

మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. మరాఠీ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నేరుగా చేసిన తెలుగు చిత్రం 'సీతారామం'. ఈ సినిమా కోసం ఈమెను ఎంపిక చేసుకొని మరీ తెలుగు తెరకు పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ..

ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమా నుండీ శృతిహాసన్ తప్పుకోవడంతో ఆస్థానాన్ని భర్తీ చేసింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరోవైపు హిందీలో సిద్ధాంత్ చతుర్వేదితో ఒక సినిమా చేస్తోంది. ఇకపోతే చేస్తున్నది సినిమాలు తక్కువే అయినా.. ఎఫైర్ రూమర్స్ తో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే గత రెండు నెలలుగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై ఆమె ఖండించిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఫిబ్రవరి 14వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు.

దీంతో ఈ రూమర్స్ పై గత రెండు రోజుల క్రితం స్పందించిన ఈమె.. మళ్లీ తన పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అసలు విషయంలోకి వెళితే.. ధనుష్ తో మృణాల్ ఫిబ్రవరి 14వ తేదీన ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలపై ఆమె మాట్లాడుతూ.. "ఫిబ్రవరి 14 కాస్త నాకు ఏప్రిల్ ఒకటిగా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ ఒకటి ఫుల్ డే కదా.. ఇదంతా ఎవరు మొదలు పెడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. పైగా నేను ఈ డేట్ ను అధికారికంగా చెప్పినట్లు కొంతమంది ఇలాంటి గాసిప్స్ కూడా వ్యాపింప చేస్తున్నారు. దీనిపై నాకు మరింత భయంగా ఉంది అంటూ ఆమె కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా పెళ్లి పై స్పందించింది మృణాల్ ఠాకూర్ తాజాగా ఒక ఆంగ్లం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.." వివాహం విషయంలో తొందర లేదు. పెళ్లి చేసుకుంటాను. కానీ దానికంటూ సమయం రావాలి. సరైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడే నేను వివాహ బంధంలోకి అడుగు పెడతాను.. అప్పుడు నేనే స్వయంగా నా సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తాను. ఆ విషయాన్ని మీతో పంచుకునే మొదటి వ్యక్తిని కూడా నేనే అవుతాను. అప్పటివరకు ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి" అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఏది ఏమైనా తన పెళ్లి గురించి తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పడంతో ఇకపై ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. అవన్నీ ఫేక్ అండ్ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదివరకే మృణాల్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ తాను సినిమాలలో చేయడం తన బాయ్ ఫ్రెండ్ కి ఇష్టం లేదని అందుకే బ్రేకప్ చెప్పుకున్నాను అని కూడా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News