మెగాస్టార్ మూవీ..అన‌స్వ‌రకు ల‌క్కీ ఛాన్స్!

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-02-14 12:48 GMT

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న క‌థానాయ‌కుడిగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు`. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 12న సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ని స‌మ్మోహ‌న ప‌రిచింది.

సంక్రాంతి బ‌రిలో ఎన్ని సినిమాలు పోటీప‌డినా వాట‌న్నింటినీ వెన‌క్కి నెట్టి సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. చిరు కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని ఔరా అనిపించింది. ఫ‌స్ట్ షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లు రాబ‌ట్టి ఈ స్థాయిలో ఈ ఏడాది ప్రారంభంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబట్టిన తొలి రీజ‌న‌ల్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా మెగాస్టార్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని అందించింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత మెగాస్టార్ న‌టించిన `విశ్వంభ‌ర‌` రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే దీని రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో చిరు మ‌రో క్రేజీ మాస్ మ‌సాలా యాక్ష‌న్ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. డైరెక్ట‌ర్ బాబి కొల్లి డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ యాక్ష‌న్ డ్రామా చేయ‌బోతున్నారు. దీన్ని ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో `జ‌న నాయ‌గ‌న్‌`, య‌ష్‌తో `టాక్సిక్‌` మూవీల‌ని నిర్మిస్తున్న కె.వి.ఎన్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత వెంక‌ట్ కె. నారాయ‌న నిర్మించ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా రోజులుగా జ‌రుగుతోంది. `జ‌న నాయ‌గ‌న్‌` చుట్టూ సెన్సార్ ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల సెన్సార్ వివాదం ఫైన‌ల్‌కు చేర‌డంతో నిర్మాత చిరు సినిమాపై దృష్టి పెట్టిన‌ట్టుగా తెలిసింది. ఈ మూవీని తండ్రీ కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం చిరుకు కూతురుగా ఎవ‌రైతే బాగుంటుంద‌ని ఇప్ప‌టికే కొంత మంది యంగ్ క్రేజీ హీరోయిన్‌ల పేర్లను ప‌రిశీలించిన టీమ్ ఫైన‌ల్‌గా `రేఖా చిత్రం`, ఛాంపియ‌న్, విత్ ల‌వ్ చిత్రాల ఫేమ్ అన‌స్వ‌ర రాజ‌న్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా ఇన్ సైడ్ టాక్‌.

క‌థ‌లో కూతురు పాత్ర‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉండ‌టంతో ఆ క్యారెక్ట‌ర్‌లో బాగా పాపుల‌ర్ అయిన న‌టి అయితే బాగుంటుంద‌ని భావించిన మేక‌ర్స్, డైరెక్ట‌ర్ బాబి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని భావోద్వేగాల‌కు ప్రాధాన్య‌త ఉన్న క్యారెక్ట‌ర్ కావ‌డంతో అన‌స్వ‌ర న‌ట‌న సినిమాకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తుంది భావించి ఫైన‌ల్‌గా ఆ పాత్ర కోసం అన‌స్వ‌ర రాజ‌న్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే టీమ్‌ అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News