డ‌బుల్ బొనాంజా: శ్రీ‌విష్ణు వ‌ర్సెస్ శ్రీ‌విష్ణు!

టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో సినిమాల విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. ఒక్క రోజు తేడాతో రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.;

Update: 2026-02-14 12:21 GMT

టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో సినిమాల విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. ఒక్క రోజు తేడాతో రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆ హీరో మ‌రెవ‌రో కాదు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ శ్రీ‌విష్ణు. త‌ను న‌టించిన రెండు సినిమాలు ఒక్క రోజు లేడాతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. దీంతో ఒక్క రోజు తేడాతో రెండు డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌ని అందించిన హీరోగా శ్రీ‌విష్ణు రేర్ ఫీట్‌ని క్రియేట్ చేయ‌బోతున్నాడు. శ్రీ‌విష్ణు న‌టించిన రెండు సినిమాల్లో ఈ నెలాఖరు 27న ఒక‌టి, 28న మ‌రొక‌టి రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు సినిమాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో డిఫ‌రెంట్ జోన‌ర్ క‌థ‌ల‌తో రూపొందిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ఫిబ్ర‌వ‌రి 27న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న మూవీ `మృత్యుంజ‌య్‌`. శ్రీ‌హుసేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దీన్ని తెర‌కెక్కించారు. శ్రీ‌విష్ణు న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. రెబా మోనికా జాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ఇంటెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా మంచి ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది.

ఆద్యంతం ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో స‌రికొత్త థ్రిల్ల‌ర్‌గా దీన్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌హుసేన్ షా కిర‌ణ్ తెర‌కెక్కించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. దీంతో ఈ మూవీ కోసం శ్రీవిష్ణు అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఫిబ్ర‌వ‌రి 28న `విష్ణు విన్యాసం` రాబోతోంది. య‌దునాథ్ మారుతీరావు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `ఆయ్‌` ఫేమ్ న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించింది.

ఇది శ్రీ‌విష్ణు మార్కు హాస్యంతో సాగే రొమాంటిక్ ల‌వ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌. ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన టీజ‌ర్‌, రిలీజ్ డేట్ పోస్ట‌ర్ల‌లో శ్రీ‌విష్ణు క‌ల‌ర్ ఫుల్ కాస్ట్యూమ్స్‌లో క‌నిపించి సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాడు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కింగ్ అనిపించుకుంటున్న శ్రీ‌విష్ణు మార్కు కామెడీ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న `విష్ణు విన్యాసం`కు సంబంధించిన ఓ లిరిక‌ల్ సాంగ్‌ని ప్రేమికుల రోజు సంద‌ర్భంగా టీమ్ విడుద‌ల చేసింది. `మొద‌లే..మొద‌లే..` అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆక‌ట్టుకుంటూ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఒక్క రోజు తేడాతో రెండు డిఫ‌రెంట్ జోన‌ర్ ల‌తో రూపొందించిన సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న శ్రీ‌విష్ణు రెండు సినిమాల‌తో ఆక‌ట్టుకుని ఒకే సారి రెండు హిట్‌ల‌ని సొంతం చేసుకున్న హీరోగా రేర్ ఫీట్‌ని క్రియేట్ చేస్తాడా? అన్న‌ది తెలియాలంటే ఈ నెలాఖ‌రు వ‌రకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News