తండ్రి హిట్‌ సినిమా రీమేక్‌ చేయాలనుందట

Update: 2020-11-18 11:50 GMT
రియల్‌ స్టార్‌ శ్రీహరి ఎన్నో విలక్షణ పాత్రలు చేశాడు. కెరీర్‌ ఆరంభంలోనే విలన్‌ గా నటించాడు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పంచాడు ఇంకా కొన్ని సినిమాల్లో తన కామెడీతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక కొన్ని సినిమాల్లో శ్రీహరి హీరోగా కూడా నటించాడు. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో భద్రాచలం కీలకమైనది. ఆయనకు ఆ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆ సినిమాలో శ్రీహరి పల్లెటూరు నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఫైటర్‌ గా కనిపించాడు. ఇప్పుడు ఆ సినిమాను ఆయన తనయుడు మేఘాంష్‌ రీమేక్‌ చేయాలని కోరుకుంటున్నాడు.

రాజ్ దూత్‌ సినిమాతో హీరోగా పరిచయం అయిన మేఘాంష్‌ ప్రస్తుతం తన రెండవ సినిమా కోతి కొమ్మచ్చి సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. ఇదే సమయంలో ఒక మీడియా సంస్థతో ఈ యువ హీరో మాట్లాడుతూ నాన్న గారిలా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. ఆయన చేసిన పాత్రల్లో నాకు చాలా పాత్రలు ఇష్టం. ఆయన చేసిన భద్రాచలం సినిమా రీమేక్‌ చేయాలనేది నా కోరిక అంటూ ఈ సందర్బంగా మేఘాంష్‌ చెప్పుకొచ్చాడు. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.
Tags:    

Similar News