క్రిస్మ‌స్ కానుక‌గా వస్తున్న మెగా హీరో..?

Update: 2020-11-24 14:30 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించారు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. థమన్ సంగీతం అందించాడు. సమ్మర్ లో రిలీజ్ కావల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' చిత్రాన్ని కూడా జీ 5 ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ అవుతుండటంతో ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు.

కాగా, 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ మూడో వారంలో విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన థియేట‌ర్స్ బుకింగ్ ఇప్ప‌టికే మొదలైనప్పటికీ సంక్రాంతి సినిమాల రిలీజులు దృష్టిలో పెట్టుకుని జ‌న‌వరి మొద‌టి వారం వ‌ర‌కు మాత్ర‌మే అగ్రిమెంట్స్ చేస్తున్నట్లుగా స‌మాచారం. 'చిత్రలహరి' 'ప్రతిరోజు పండగే' వంటి వరుస విజయాల తర్వాత సాయి తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి మెగా మేనల్లుడికి 'సోలో బ్రతుకే..' సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News