నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యంతో క్రిస్మ‌స్ రిలీజ్ డౌటేనా?

Update: 2020-12-16 04:50 GMT
డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు లేదా కొంద‌రు బ‌డా బాబులు థియేట‌ర్ల‌పై గుత్తాధిప‌త్యం చెలాయిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు చాలా కాలంగా ఉన్న‌వే. వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజు.. కంటెంట్ ట్రాన్స్ పోర్ట్ ఫీజు వ‌గైరా కోత కోయాల‌ని .. థియేట‌ర్ యాజ‌మాన్యాలే ప్రొజెక్ట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని .. వ‌గైరా వ‌గైరా డిమాండ్లు నిర్మాత‌ల వైపు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా ఎగ్జిబిట‌ర్ తో స‌త్సంబంధాల ద్వారా త‌మ ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు నిర్మాత‌లు ప్ర‌తిసారీ పావులు క‌ద‌ప‌డం దానికి కొంద‌రు సినీపెద్ద‌లే మోకాల‌డ్డేయ‌‌డం వ‌గైరా టాపిక్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

క‌రోనా క్రైసిస్ అనంత‌రం థియేట‌ర్ల‌ను తెరిచేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఎగ్జిబిట‌ర్ల‌పై మ‌రోసారి నిర్మాత‌ల కండీష‌న్లు అప్ల‌య్ అంటూ విరుచుకుప‌డ‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. నిర్మాతలు ఇకపై వీపీఎస్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) చెల్లించమ‌ని.. కంటెంట్ ట్రాన్స్ పోర్ట్ నిమిత్తం నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల ప్రొజెక్టర్లను డిజిటల్ ప్రొవైడర్స్ నుండి థియేటర్స్ యాజమాన్యం కొనుగోలు చేయాల‌ని.. ఇందులో నిర్మాతల సాయం తీసుకోవచ్చని అంటున్నారు.

అయితే ఇప్పుడున్న స‌న్నివేశంలో క్రిస్మ‌స్ రిలీజ్ కి రెడీ అవుతున్న `సోలో బ్ర‌తుకే సోబెటర్` ప‌రిస్థితేమిటి? అన్న‌దే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. జీ వాళ్లు నిర్మాత‌ల కౌన్సిల్ కి ఎదురెళ్లి ఈ చిత్రాన్ని ఎగ్జిబిట‌ర్స్ కి అనుగుణంగా థియేట‌ర్స్ లో ఈ నెల 25న విడుద‌ల చేస్తారా..! అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతానికి సోలో మూవీ టీమ్ ఈ విష‌యాల‌తో సంబంధం లేకుండా సాయితేజ్ తో ప్ర‌మోష‌న్స్ మాత్రం చేయిస్తోంది. నిన్న‌నే ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ త‌మ డిమాండ్స్ కి ఎగ్జిబిట‌ర్స్ ఒప్ప‌కునే వ‌ర‌కు ఎలాంటి సినిమాలు రిలీజ్ చేయ‌బోమని అధికారికంగా ప్ర‌క‌టించారు. నిర్మాత‌లు అడుగుతున్న డిమాండ్స్ కి ఎగ్జిబిట‌ర్లు ఒప్పుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో జీ వాళ్లు సాయి తేజ్ సినిమా విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News