శృతిహాసన్‌ రేటుకు అదిరి పడుతున్న వకీల్‌ సాబ్‌

Update: 2020-06-17 12:10 GMT
పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ ను వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ కు ఇది రీమేక్‌. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకున్న సమయంలో మహమ్మారి వైరస్‌ విజృంభించిన కారణంగా షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెల్సిందే. బ్యాలన్స్‌ పార్ట్‌ ను షూట్‌ చేసేందుకు దిల్‌ రాజు ఏర్పాట్లు చేశాడు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో పవన్‌ కళ్యాణ్‌ లేకుండా ఇతర యూనిట్‌ సభ్యులతో చిత్రీకరణ చేస్తున్నారట. పవన్‌ ఈ వారాంతంలో లేదా వచ్చే వారంలో చిత్రీకరణలో జాయిన్‌ కాబోతున్నాడు. ఇక శృతి హాసన్‌ కూడా చిత్రీకరణకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్‌ చేరుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఏడు నుండి పది రోజుల పాటు శృతి హాసన్‌ ఈ చిత్రం షూటింగ్‌ లో పాల్గొబోతుంది. అయినా కూడా ఏకంగా రూ. 70 లక్షల పారితోషికంను ఈమె డిమాండ్‌ చేసిందట.

సాదారణంగా అయితే కోటికి పైగా పారితోషికం తీసుకునే ఈ అమ్మడు తక్కువ రోజుల్లోనే షూట్‌ పూర్తి చేస్తున్నారు కనుక కాస్త తగ్గించుకుని 70 లక్షలకు ఫైనల్‌ చేసిందట. ఈ పారితోషికం భారీ మొత్తం అంటూ దిల్‌ రాజు అనుకున్నా కూడా తప్పని పరిస్థితుల్లో ఆమెతో ఆ పాత్ర చేయించాలని నిర్ణయించారట. ఒక పాటతో పాటు రెండు మూడు సీన్స్‌ లో శృతి హాసన్‌ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News