క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తోన్నా క్రెడిట్ అంతా ఏఐ ఖాతాలో!

అయితే ఇదే ఏఐతో చిత్ర పరిశ్రమలో టీజ‌ర్, ట్రైలర్స్ విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంటోంది.;

Update: 2026-03-01 00:30 GMT

`ఏఐ` కార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి పరిస్థితులు నెల‌కొన్నాయో తెలిసిందే. సెల‌బ్రిటీల పాలిట శాపంగా మారింది. అశ్లీల మార్పింగ్ వీడియోల‌తో అదంతా ఫేక్ అని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితులు హీరోయిన్ల‌కు ఎదుర వుతున్నాయి. ఏఐ ఆరంభ ద‌శ‌లో ఈ త‌ర‌హా వీడియోలు ఎక్కువ‌గా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా సినిమా ల‌పై ఏఐ ప్ర‌భావం స్ప‌ష్టంగా ప‌డింది. టెక్నాల‌జీ వాడుకున్న వాళ్ల‌కు వాడుకున్నంత అన్న‌ట్లు స‌క్రమంగా వాడితే? ఏఐతో ప‌ని సుల‌భం. త‌క్కువ ఖ‌ర్చులో తేలిపోతుంది. అయితే ఇదే ఏఐతో చిత్ర పరిశ్రమలో టీజ‌ర్, ట్రైలర్స్ విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంటోంది.

ఏదీ నిజ‌మైనా ట్రైల‌రో ? ఏది ఏఐ ట్రైల‌రో అధారంతో స‌హా బ‌య‌ట పెడితే త‌ప్ప నిర్దారించుకోవ‌డం క ష్టంగా మారింది. యూట్యూబ్‌లో ఏవైనా పెద్ద సినిమాల పేర్లు సెర్చ్ చేసినప్పుడు అసలు సినిమా షూటింగే మొద లవ్వక ముందే ఏఐ సృష్టించిన `కాన్సెప్ట్ ట్రైలర్స్` దర్శనమిస్తున్నాయి. ఏఐ టూల్స్ వాడి నటీనటుల ముఖాలను, వాయిస్‌ను ఎంత ఖచ్చితంగా మారుస్తున్నారు. అది నిజంగానే అధికారిక ట్రైలర్ అని సామాన్య ప్రేక్షకులకే కాదు సినిమా వాళ్లు కూడా క‌న్ప్జూజ్ అవుతున్నారు. ఇటీవల `సూపర్‌మ్యాన్` రీబూట్ విషయంలో ఏఐ ట్రైలర్ ఏకంగా ఒక విదేశీ టీవీ ఛానల్‌నే తప్పుదోవ పట్టించింది.

తాజాగా రిలీజ్ అయిన `జైల‌ర్ 2` ప్రోమో విష‌యంలోనూ అదే జ‌రిగింది. `వార‌ణాసి` టీజ‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. దీంతో రాజ‌మౌళి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. సినిమా ప్రచార చిత్రాలపై వస్తున్న ఏఐ ఆరోపణలను తిప్పికొట్టడానికి నిర్మాతలు, దర్శకులు తప్పనిసరిగా బిహైండ్ ది సీన్స్ లేదా మేకింగ్ వీడియోలను విడుదల చేయాల్సి వస్తోంది. ఈ గందరగోళాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా వీడియో లేదా ఇమేజ్ ఏఐ తో సృష్టించబడితే, దానిపై ఖచ్చితంగా మేడ్ విత్ ఏఐ అనే లేబుల్ త‌ప్ప‌నిస‌రి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఏఐ కంటెంట్‌ను గుర్తించి వాటికి డిజిటల్ వాటర్ మార్క్స్ వేయడం తప్పని సరి చేశారు. ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రిగా పాటిస్తే? ఏది ఓరిజిన‌ల్ అన్న‌ది తెలుస్తుంది. లేదంటే క‌నిపెట్ట‌డం క‌ష్టం. భ‌విష్య‌త్ లో ఏఐ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. అప్పుడింకా స‌మ‌స్య జ‌ఠిల‌మ‌వుతుంది. ఎంతో క్రియేటివ్ గా ప‌ని చేసినా క్రెడిట్ అంతా ఏఐ ఖాతాలోకి పోతుంది. భారీ వ్య‌యంతో సినిమాలు చేసే వారంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే కోట్ల రూపాయ‌లు బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది.

Tags:    

Similar News