ఇండియ‌న్ సినిమా గేమ్ మార్చేస్తాడ‌ట‌!

యంగ్ డైరెక్ట‌ర్స్ అండ్ హీరోలు గేరు మార్చేశారు. గ‌త కొంత‌కాలంగా చేస్తున్న సినిమాల‌కు పూర్తి భిన్నంగా స‌రికొత్త క‌థ‌ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.;

Update: 2026-02-28 17:30 GMT

యంగ్ డైరెక్ట‌ర్స్ అండ్ హీరోలు గేరు మార్చేశారు. గ‌త కొంత‌కాలంగా చేస్తున్న సినిమాల‌కు పూర్తి భిన్నంగా స‌రికొత్త క‌థ‌ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. బ‌డ్జెట్‌, కంటెంట్ విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ టాలీవుడ్ స్టార్డ్స్ కు మించి పాన్ ఇండియా సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని దేశ వ్యాప్తంగా ఆక‌ట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేచుర‌ల్ స్టార్ నాని వంటి స్టార్స్ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వీటి బాట‌లోనే విశ్వ‌క్‌సేన్‌, శర్వానంద్ కూడా భారీ సినిమాల‌కు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు కూడా ఇప్పుడు కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం చుడుతూ ఆశ్చ‌ర్య‌పరుస్తున్నారు. శ్రీ‌కాంత్ ఓదెల `ది ప్యార‌డేజ్‌`తో న్యూ గేమ్ ఛేంజ‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ సాలీడ్ స్క్రిప్ట్‌ల‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచే వారెవ‌రురా`. స‌రిపోదా శ‌నివారం వంటి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న వివేక్ ఆత్రేయ ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానుంది. ఇదిలా ఉంటే ఈ యంగ్ డైరెక్ట‌ర్ గురించి హీరో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీ‌విష్ణు ఆస‌క్తిక‌మైన విష‌యాల్ని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `మెంట‌ల్ మ‌దిలో`. బ్రోచే వారెవ‌రురా` వంటి సినిమాల్లో న‌టించాడు శ్రీ‌విష్ణు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆ అనుబంధంతో వివేక్ ఆత్రేయ గురించి, అత‌ని వ‌ద్ద ఉన్న ఎక్సైటింగ్ స‌బ్జెక్ట్‌ల గురించి రీసెంట్‌గా చెప్పుకొచ్చాడు శ్రీ‌విష్ణు.

వివేక్ ద‌గ్గ‌రరెండు, మూడు స్టోరీస్ ఉన్నాయి. అవి త‌ను ఎప్పుడు తీస్తాడో తెలియ‌దు కానీ నాకు తెలిసి అవి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్స్ట్ అవి. ఎలాంటి క‌థ‌లంటే అవి ఇండియ‌న్ సినిమానే స‌మూలంగా మార్చేసే గేమ్ ఛేంజ‌ర్స్‌. ఇప్పుడే చిన్న చిన్న‌గా వెళుతున్నాడు. త‌న వ‌ద్ద ఉన్న రెండు స్టోరీస్‌ల‌లో ఏది ముందు వ‌స్తుందో తెలియ‌దు కానీ అవి నాకు చాలా ఇష్ట‌మైన స‌బ్జెక్ట్స్ అవి. అవి త‌ను త్వ‌ర‌గా చేయాల‌ని కోరుకుంటున్నాను. అవి ఎప్పుడొచ్చినా స్టన్సింగ్‌గా ఉంటాయి. స్ట‌న్సింగ్ స్క్రిప్ట్స్ , స్క్రీన్‌ప్లే అంటే ఏంటో చూపిస్తాయని శ్రీ‌విష్ణు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. అవి ఎవ‌రితో చేస్తాడో తెలియ‌దు కానీ ఓ రేంజ్‌లో ఉంటాయ‌ట‌.

మేము చ‌ర్చించుకునే స‌మ‌యంలో ఏం అనుకునే వాళ్ల‌మంటే ..త‌న‌కు డైరెక్ట‌ర్‌గా మ‌రింత బ్రాండ్ వ్యాల్యూ పెర‌గాలి. అలా బ్రాండ్ వ్యాల్యూ బాగా పెంచుకున్న త‌రువాత చేస్తే త‌న వ‌ద్ద ఉన్న స్టోరీస్ ఇండియ‌న్ సినిమా గేమ్ ఛేంజ‌ర్స్‌గా నిలిచి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తాయ‌ని హీరో శ్రీ‌విష్ణు ఫుల్ కాన్ఫిడెంట్‌తో చెబుతున్నారు. `స‌రిపోదా శ‌నివారం` త‌రువాత వివేక్ ఆత్రేయ త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో ఓ భారీ మూవీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేయ‌డం తెలిసిందే. శ్రీ‌విష్ణు చెబుతున్న క‌థ‌ల‌ని బాల‌య్య‌, ర‌జ‌నీల‌తో వివేక్ చేస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News