దేవుడి బట్టల్లో ఉంటే అలా అడుగుతారా?.. రేణు దేశాయ్ ఫైర్
సీనియర్ నటి రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, పిల్లలతో గడిపే క్షణాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.;
సీనియర్ నటి రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, పిల్లలతో గడిపే క్షణాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తన పోస్టులకు కొందరు పెడుతున్న బ్యాడ్ కామెంట్స్ పై తాజాగా రెస్పాండ్ అయ్యారు. ఇన్ స్టాగ్రామ్ లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి తన ఆవేదనను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తనకు ఇప్పుడు ఎలాంటి వేధింపులు ఎదురైనా తాను ఎవరినీ వదలనని చెపారు. సైబర్ పోలీసులు వారు ఎక్కడ నివసిస్తున్నారో కనిపెట్టి అరెస్టు చేసేలా తాను చూసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు తప్పుడు కామెంట్స్ చేయడం చాలు అని అన్నారు. అదే సమయంలో అందరికీ ఎలాంటి రైట్స్ ఉన్నాయో.. తనకు కూడా అంతే రైట్స్ ఉన్నాయని తెలిపారు. తాను ఒక సాధారణ పౌరురాలిని చెప్పారు.
ఏ సెలబ్రిటీ, రాజకీయ నాయకుడిపై అయినా తప్పుడు కామెంట్ చేస్తే అదే చేసిన వారికే చెందుతుందని అన్నారు. "నీచ రాక్షసులు, సంస్కారం లేని మనుషులు.. సంస్కారం ఉంటే అలా మెసేజ్ పెట్టరు. మీరు చెత్త బూతులు పెడుతున్నారు. కాశీకి వెళ్లానని ఫోటో పెడితే రాత్రికి రేటెంత అని అడుగుతున్నారు. ఎలా ఎవరిని అడుగుతున్నారు.. నీకు తిని పరిస్థితి లేదు.. నాకేంటి అడుగుతున్నావు" అని నిలదీశారు.
కాశీలో బొట్టుతో దేవి బట్టలతో ఉన్నానని తెలిపారు. మామూలుగా బట్టల కోసం డిస్కషన్ స్టార్ట్ చేశారని చెప్పారు. తాను అమ్మవారి బట్టల్లో ఉంటే నైట్ రేటు అడుగుతున్నారని అన్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అని ఫైర్ అయ్యారు. ఇదేనా సంస్కారమని ప్రశ్నించారు. పబ్లిక్ ముందు వచ్చి కూర్చుంటానని, బండబూతులు తిట్టాలని సవాల్ విసిరారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏదైనా ఒక ప్రాణం నిలబడుతుందా? చెప్పండని అడిగారు.
అయితే కుక్కలను తాను చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. అసలు తనపై అంత ద్వేషం ఎందుకని మండిపడ్డారు. విడాకులైనప్పటి నుంచి తన గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. భరణం తీసుకున్నానని, వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయ పార్టీకి బానిస అంటూ ఇలా తిడుతున్నారని చెప్పుకొచ్చారు.
అయితే తనపై కామెంట్స్ చేసేందుకు ఏం మిగల్లేదు అనుకున్నానని, అది తప్పని అర్థమైందని చెప్పారు. జనవరిలో కుక్కల కోసం ప్రెస్ మీట్ కు రానున్నానని ఏం మాట్లాడినా తిడతారే తప్ప సమాధానం దొరకదని చెప్పానని తెలిపారు. కానీ కొన్ని ఎన్జీవోలు తనను రమ్మని అడిగితే వచ్చానని, కుక్కల్ని దారుణంగా చంపేస్తుంటే బాధేసి వచ్చానని చెప్పారు. కానీ తన మాటలు అర్థం చేసుకోకుండా నానా బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.