ఎవ‌రి రూట్లోకి ఎవ‌రొచ్చిన‌ట్లు?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `స్పిరిట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-28 19:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `స్పిరిట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ తో పాటే ప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. `పౌజీ` తో పాటు `క‌ల్కి 2` కూడా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అయితే ఇక్క‌డ ఓ కండీష‌న్ గుర్తు చేసుకోవాలి. `స్పిరిట్` మొద‌లైతే? ఆ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ ప్ర‌భాస్ మ‌రో సినిమా చేయ‌డానికి వీలు లేదు. ఇది ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కండీష‌న్ గా వైర‌ల్ అయింది.

ప్ర‌భాస్ ఫోక‌స్ డైవ‌ర్ట్ కాకుండా ఉండాలంటే? మ‌రో సినిమా చేయ‌కూడ‌దు. ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ ల‌కు హాజ‌రైతే త‌న సినిమా పాత్ర‌పై వంద శాతం ఎఫెర్ట్ పెట్ట‌లేరు అన్న‌ది వంగా అభిప్రాయం. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ను కండీష‌న్ కు ఒప్పించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఈ విషయంలో ప్ర‌భాస్ కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు ఎలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. వంగా కండీష‌న్ కు లోబ‌డే ప‌ని చేస్తాన‌న్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. కానీ ప్ర‌స్తుతం స‌న్నివేశం మాత్రం అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. `స్పిరిట్` షూటింగ్ తో పాటు `పౌజీ` షూటింగ్ కూడా డార్లింగ్ హాజ‌ర‌వుత‌న్నాడు.

`పౌజీ` ముగింపు ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఇప్పుడా చిత్రాన్ని హోల్డ్ లో పెడితే రిలీజ్ ఇంకా ఆల‌స్య మ‌వుతుంది? అన్న కార‌ణంతో ప్ర‌భాస్ వంగాను క‌న్విన్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. `స్పిరిట్` షూటింగ్ ఇప్ప‌టికిప్పుడు పూర్తి చేసేది కాదు. సందీప్ కూడా వేగంగా పూర్తిచేసే ద‌ర్శ‌కుడు కాదు. అత‌డి సినిమా షూటింగ్ కూడా నెమ్మ‌దిగా సాగుతుంది. తొలి సినిమా `అర్జున్ రెడ్డి` షూటింగ్ విష‌యంలో ఆర్దిక విష‌యాలు కార‌ణంగా కొంత జాప్యం జ‌రిగింది. కానీ ఆ త‌ర్వాత తెర‌కెక్కించిన `యానిమ‌ల్` షూటింగ్ కూడా పూర్త‌వ్వ‌డానికి చాలా స‌మ‌యం పెట్టింది.

ఈ ప్రాజెక్ట్ కు ఎలాంటి బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు లేవు. కానీ సందీప్ అనుకున్న విధంగా ఔట్ పుట్ రావాలంటే కంగారుగా చుట్టేయ‌డం కంటే నిదానంగా పూర్తి చేయ‌డ‌మే ఉత్తమంగా భావించి ముందుకెళ్లారు. తాజాగా `స్పిరిట్` విష‌యంలో కూడా సందీప్ ఎంత మాత్రం కంగారు ప‌డ‌టం లేదు. మొత్తానికి సందీప్ రెడ్డే డార్లింగ్ రూట్లోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.`క‌ల్కి 2` షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స‌ర్వం సిద్దం చేసుకుని రెడీగా ఉన్నాడు. `పౌజీ` షూటింగ్ పూర్త‌యిన అనంత‌రం `క‌ల్కి 2` మొద‌లు కానుంది.

Tags:    

Similar News