చార్టర్డ్ ఫ్లైట్స్ నుంచి పర్సనల్ చెఫ్‌ల వరకూ… స్టార్ లగ్జరీ డిమాండ్స్‌పై ఇండస్ట్రీలో కలకలం!

ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటుల ప్రయాణపు అలవాట్లపై తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని సమాచారాలు సోషల్ మీడియాలో డిస్క‌ష‌న్ టాపిక్ గా మారాయి.;

Update: 2026-02-28 22:30 GMT

ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటుల ప్రయాణపు అలవాట్లపై తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని సమాచారాలు సోషల్ మీడియాలో డిస్క‌ష‌న్ టాపిక్ గా మారాయి. ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ ఫిల్మ్‌ఫేర్, ఎవరిపేర్లు వెల్లడించకుండా ఓ ఇన్‌సైడర్ చెప్పిన‌ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైరల్‌గా మారాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే, సినీ ప్రముఖుల లగ్జరీ ట్రావెల్ కల్చర్‌పై మళ్లీ చర్చ మొదలైంది.

ఇన్‌సైడర్ వివరాల ప్రకారం, ఒక ఏ-లిస్ట్ నటి ఫ్లైట్ జ‌ర్నీ కోసం టికెటింగ్, బోర్డింగ్ అవసరాలకే 14 మందితో కలిసి ప్రయాణించిందని తెలుస్తోంది. ఆ 14 మందిలో ఆమె డిజిటల్ టీమ్ కూడా ఉండటం విశేషం. అయితే సోషల్ మీడియా ఖర్చులను భరించడానికి మ్యాగజైన్ నిరాకరించడంతో, ఆ నటి తన బృందాన్ని ఎనిమిది మందికి తగ్గించిందని సమాచారం. ఈ వివరాలు బయటకు రావడంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మ‌రో సిట్యుయేష‌న్ లో, ఒక స్టార్ కొడుకు ఎప్పుడూ 11 మందికి తగ్గకుండా ప్రయాణిస్తాడని తెలిపారు. రీసెంట్ గా స్పెయిన్‌లో జరిగిన ఓ షూట్ సందర్భంగా, ఓ సెమీ-ఆర్ట్సీ డైరెక్ట‌ర్ ఈ విష‌యంలో ఆశ్చర్యానికి గురయ్యార‌ని, త‌న హీరో 16 మందితో ట్రావెల్ చేశార‌ని, వారిలో టాటూ ఆర్టిస్ట్, జూనియర్ ఫైటర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఈ సంఘటనలు నిర్మాతలపై పడుతున్న అదనపు భారం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

ఇన్‌సైడర్ ఆరోపణల ప్రకారం, ప్రస్తుతం అనేక మంది ప్రముఖులు కమర్షియల్ ఫ్లైట్ల కంటే చార్టర్డ్ ఫ్లైట్లు ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల సమయంలో అయ్యే భారీ ప్రైవేట్ ఫ్లైయింగ్ ఖర్చులను నిర్మాతలే భరించాల్సి వస్తోందని అంటున్నారు. అంతేకాకుండా, కొందరు నటులు ప‌ర్స‌న‌ల్ చెఫ్‌లను వెంట తీసుకెళ్లడమే కాకుండా, స్పెష‌ల్ డైట్ కోసం వేరే చెఫ్ కావాలని లేదా ప‌ర్స‌న‌ల్ ట్రైనర్‌కు స్పెష‌ల్ బ‌డ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ ఖర్చులన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేర్లు వెల్లడించకపోయినా, సోషల్ మీడియాలో అభిమానులు ఈ విష‌యంలో ఊహాగానాలకు తెరలేపారు. కొందరు వీట‌న్నింటినీ చూస్తుంటే ర‌ణ్‌వీర్ సింగ్ లేదా షాహిద్ క‌పూర్ అయుండొచ్చ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ కల్చర్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు మరియు లగ్జరీ డిమాండ్లు నిర్మాతలకు భారమవుతున్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది. అభిమానుల్లో కొందరు ఈ ఆరోపణలను తీవ్రంగా విమర్శిస్తూ, ఇది అతిశయోక్తి అయినా కావొచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం నిర్మాతలపై ఈ రూపంలో అధిక ఒత్తిడి తేవడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ వివాదం స్టార్ ఇమేజ్, నిర్మాతల బాధ్యతలు, మరియు ఇండస్ట్రీలో మారుతున్న పని విధానాలపై కొత్త చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News