• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ వర్సెస్‌ లైకా... ఆ...

శంకర్ వర్సెస్‌ లైకా... ఆ సీక్వెల్‌ పనైపోయినట్లేనా?

By - Tupaki Desk
Update: 2021-04-18 09:30 GMT
దర్శక దిగ్గజం శంకర్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఇండియన్‌ (భారతీయుడు) సినిమా ఒకటి. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన ఆ సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్‌ హిట్ అయ్యింది. ఆ సినిమాకు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్‌ ను చేసేందుకు శంకర్ ముందుకు వచ్చాడు. కమల్‌ హాసన్ కూడా సినిమా పై ఇంట్రెస్ట్‌ చూపించి షూటింగ్‌ లో కూడా పాల్గొన్నాడు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గా పట్టాలెక్కి షూటింగ్ కూడా సగంకు పైగా జరుపుకున్న ఇండియన్‌ 2 అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. క్రేన్‌ యాక్సిడెంట్‌ వల్ల సినిమా పూర్తిగా మూలకు పడ్డట్లయ్యింది.

ఇటీవల దర్శకుడు శంకర్‌ తన తదుపరి సినిమాలను ప్రకటించాడు. ఈ ఏడాది జులై లో చరణ్‌ తో సినిమాను మొదలు పెట్టబోతున్న శంకర్‌ వచ్చే ఏడాది బాలీవుడ్‌ హీరో తో అపరిచితుడు రీమేక్‌ ను చేసేందుకు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఇండియన్‌ 2 పూర్తి చేయకుండానే శంకర్ ఇతర సినిమాలకు కమిట్‌ అవ్వడం పట్ల చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టును ఆశ్రయించారు. తమ సినిమా మద్యలో వదిలేశాడంటూ వారు కోర్టును ఆశ్రయించిన తనేపథ్యంలో శంకర్ కూడా కౌంటర్‌ దాఖలు చేశారు. ఇండియన్ 2 ప్రాజెక్ట్‌ ను  ముందుకు తీసుకు వెళ్లేందుకు వారు స్పందించలేదు. దాంతో నా రెండు సంవత్సరాలు వృదా అయ్యాయి. అందుకే ఇతర సినిమాలను చేసేందుకు సిద్దం అయినట్లుగా చెప్పుకొచ్చాడు.

సినిమా దర్శక నిర్మాతలు ఇంతగా కోర్టులో పడి కొట్టుకున్న తర్వాత మళ్లీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే అంటున్నారు. ప్రాజెక్ట్ నిర్మాత మారితే తప్ప ఇండియన్ 2 ను శంకర్‌ మళ్లీ టేకోవర్‌ చేసే అవకాశాలు లేవు. ఇదే సమయంలో కమల్ హాసన్‌ ఆపరేషన్ కారణంగా ఇప్పట్లో ఇండియన్ 2 లో జాయిన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇవన్ని పరిణామాలు చూస్తుంటే ఇండియన్ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే శంకర్ తదుపరి సినిమా పట్టాలెక్కబోతుంది. కనుక అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు అపరిచితుడు రీమేక్ విషయంలో కూడా వివాదం రాజుకుంటుంది. దాన్ని శంకర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
Tags:    
  • kollywod Movies 
  • Kollywood Updates 
  • Kollywood Upcoming Movies 
  • Shankar 
  • Director Shankar 
  • lyca productions 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS