ష‌కీలా బ‌యోపిక్.. ఉన్న‌దున్న‌ట్టు తీయ‌లేదా?

Update: 2020-12-17 04:13 GMT
మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన శృంగార తార‌ ష‌కీలా. ఆమె జీవిత క‌థ ఆధారంగా `ష‌కీలా` పేరుతో ఓ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇంద్ర‌జిత్ లంకేష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హిందీతో పాటు ప‌లు కీల‌క భార‌తీయ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. బ‌యోపిక్ అంటూ త‌మ‌కు ఎలా న‌చ్చితే అలా ఈ చిత్రాన్ని తీసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. 80వ ద‌శ‌కంలో ద‌క్షిణ భార‌తాన్ని త‌న హొయ‌ల‌తో ఉర్రూత‌లూగించింది సిల్క్ స్మిత‌ హ‌ఠాణ్మ‌ర‌ణం త‌రువాత ష‌కీలా పేరు వెలుగులోకి వ‌చ్చింది. కుటుంబ భారం.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా సినిమాల్లోకి ఎంట‌రైన ష‌కీలా ముందు రొమాంటిక్ చిత్రాల్లో న‌టించినా ఆ త‌రువాత సాఫ్ట్ పోర్న్ చిత్రాల‌కు అల‌వాటుప‌డిన‌ట్టు చూపించారు.

అయితే ష‌కీలా ఫేస్ ‌ని మాత్ర‌మే వాడుకుని శృంగార స‌న్నివేశాల్లో మ‌రో న‌టిని వాడుకున్న‌ట్టుగా చూపించారు. ఇది పూర్తిగా ఎలా వుందంటే ష‌కీలా అస‌లు శృంగార స‌న్నివేశాల్లో న‌టించ‌లేద‌ని పోట్రేట్ చేసిన‌ట్టుగా వుంది. దీన్ని బ‌ట్టే ఇంద్ర‌జిత్ లంకేష్ ష‌కీలా బ‌యోపిక్ ని ఏ స్థాయిలో త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా మార్చేశాడో తెలుస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి విరుద్ధంగా తెర‌కెక్కిన ఈ మూవీ క్రిస్మ‌స్ ‌కి ఏమేర ఆక‌ట్టుకుంటోందో చూడాల్సిందే.Full View
Tags:    

Similar News