హీరోయిన్ అవుతావా? కాళ్ళు విరగ్గొడతా

Update: 2017-07-13 05:37 GMT
ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుర్లు ఎంట్రీ పై పెద్ద చర్చ జరుగుతుంది. శ్రీదేవి అయితే తన కూతుళ్లను  దగ్గరుండి మరీ లాంచ్ చేయిస్తోంది. అలాగే సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా కూడా హీరోయిన్ కాబోతుంది. షారూక్ ఖాన్ కూతురు సుహానాకు అయితే హీరోయిన్ వయసు రాకుండానే స్టార్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక అనిల్ కపూర్ కూడా తన కూతురు సోనమ్ కపూర్ ని ఎప్పుడో హీరోయిన్ చేశాడు. కానీ ఇక్కడ మరో రకం నాన్నలు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ అమ్మాయితో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తారు ఏమో అని భయపడి హీరోయిన్ అవుతాను నాన్న అని కూతురంటే.. కాళ్ళు ఇరగ్గొడతాను అంటున్నారట.

సంజయ్ దత్త్ మొదటి భార్య కూతురు త్రిశాల దత్ కూడా.. హీరోయిన్ అవ్వాలని కలల కంటోందట. హీరోయిన్ అవుతాను అని నాన్నకు చెప్పిందిట.  వెంటనే మన సంజు బాబా పిచ్చి పిచ్చిగా ఉందా కాళ్ళు విరిచేస్తాను అన్నాడట. బాబు ఎందుకు అలా అన్నాడంటే.. ఇప్పుడు మనం ఎంత నాగరికత లో ముందున్న ఇంకా ఆడవాళ్ళు పై ఒక చిన్న చూపే ఉంది పైగా సినిమాలో అయితే హీరోయిన్ ఒక వ్యాపార వస్తువు.. అందుకే వద్దన్నాడట. ఇలా సంజయ్ దత్త్ కాకుండా ఒకప్పుడు టాప్ హీరో ధర్మేంద్ర కూడా ఇలానే చేశాడట. తన మొదటి భార్య కూతురు నటిస్తాను అంటే. మరి వీళ్ళు నాన్నలుగా ఏమి ఆలోచించారో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సూపర్ స్టార్ లే తమ కూతుళ్లను హీరోయిన్ చేయడానికి భయపడితే ఇంకా మామూలు నటులు భయాలు ఇంకా ఎలా ఉంటాయో కదా.
 
హీరో కొడుకు అవ్వడం ఎవరికి ఇబ్బంది లేదు కానీ. అదే హీరోకి కూతురు ఉంటే అ అమ్మాయికి నిజంగానే నటించాలి అని ఉన్న ఆమెను నటింప చేసే  నాన్న హీరోలు ఎంత మంది ఉన్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రిలో? అందుకే ఈ మధ్యనే హీరో రాజశేఖర్ ఒక మాటన్నాడు.. ''మనం మాత్రం ఇతరుల అమ్మాయిలపై చేతులు వేసేయొచ్చు.. మన అమ్మాయిలను మాత్రం అలాంటివి జరగకుండా హీరోయిన్ కాకుండా ఉండాలి అనుకోవడం.. దారుణం'' అంటూ కామెంట్ చేశాడు. నిజమే కదా.  


Tags:    

Similar News