మొత్తానికి రేణు దేశాయ్ ఇలా రీ ఎంట్రీ ఇచ్చేసిందే!
రేణు దేశాయ్ .. పరిచయం అవసరం లేని పేరు. పవన్ కల్యాణ్ తో వివాహం .. విడిపోవడం ఇలా అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. రేణు దేశాయ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలపై ఆమెకి మంచి అవగాహన ఉంది. కథాకథనాలను కూడా ఆమె సొంతంగా తయారు చేసుకోగలరు. అందువలన ఆమె మరాఠీ సినిమాలకి దర్శకత్వం వహిస్తూ ఆ పనుల్లోనే బిజీగా ఉంటారు. పవన్ నుంచి విడిపోయిన తరువాత ఆమె సినిమాల్లోకి వస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ తెలుగు సినిమాల వైపే ఆమె రాలేదు.
ఇక ఆమె తెలుగు సినిమాలు చేయకపోవచ్చని అంతా అనుకున్న సమయంలో ఒక్కసారిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా లాంచ్ సమయంలో వేదికపై మెరిశారు .. ఈ ఫంక్షన్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీకృష్ణ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను పట్టాలకెక్కించాడు.
మెగాస్టార్ ముఖ్య అతిథిగా ఈ సినిమా లాంచ్ జరిగింది. సినీ .. రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత కూడా ఆయనే. అందువలన ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు.
చిరంజీవి .. రేణు దేశాయ్ ఒకరినొకరు చూసుకున్నారు తప్ప, పలకరింపులు .. ప్రస్తావనలు చేయలేదు. ఈ వేదికపై రేణు దేశాయ్ మాట్లాడుతూ .. "ఒక నటిగా నేను మళ్లీ కెమెరా ముందుకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రావాలని కూడా అనుకోలేదు. కానీ 2019లోనే దర్శకుడు వంశీకృష్ణ నన్ను కలిశారు.
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయాలని అడిగారు. కథ .. నా పాత్ర నాకు బాగా నచ్చాయి. దర్శకుడు కథ చెప్పిన తీరు నాకు నచ్చింది. అందువలన నేను వెంటనే ఒప్పుకున్నాను. వంశీకృష్ణ గొప్ప దర్శకులలో ఒకరుగా నిలబడతారనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.
ఇక రవితేజ - చిరంజీవి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అన్నయ్య .. అన్నయ్య అంటూ చిరంజీవితో రవితేజ చాలా చనువుగా ఉంటాడు. అందువలన పండుగ రోజైనప్పటికీ చిరంజీవి ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఇక చిరంజీవి సినిమాలోను రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆల్రెడీ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను రిలీజ్ కి రెడీ చేసిన రవితేజ, ' ధమాకా' .. ' రావణాసుర' సినిమాలను కూడా పట్టాలెక్కించాడు. ఇక ఇప్పుడు ' టైగర్ నాగేశ్వరరావు'ను కూడా అదే ఎనర్జీతో పూర్తిచేసేస్తాడన్న మాట!