మాస్ మహారాజాకి తప్పని హీరోయిన్ కష్టాలు..!

Update: 2020-05-03 07:54 GMT
ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీని ఏలిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన 'డిస్కో రాజా' ప్లాప్ అవడంతో ప్రస్తుతం నటిస్తున్న 'క్రాక్' సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడని చెప్పవచ్చు. తన కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకోగా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. అయితే రవితేజ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమా ఒప్పుకున్నాడు. 'రాక్షసుడు'లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటివ‌ర‌కు స్టార్ హీరోల‌తో ప‌నిచేయ‌ని కోనేరు వర్శిటీ వాళ్ల త‌న‌య‌డు హీరో కోనేరు హ‌వీష్ హవీష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

అయితే లాక్ డౌన్ టైములో ఎలాగూ ఖాళీగా ఉన్నాము క‌దా అని ఈ చిత్ర యూనిట్ కాస్టింగ్ ని ఫైన‌ల్ చేసే ప‌నిలో ప‌డిందట. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇద్ద‌రు హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్ కి అవ‌సరం అవుతారట. అయితే వ‌రుస ఫ్లాపులలో ఉన్న ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌డానికి ప్ర‌స్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదట. దీంతో ఎవ‌రైనా త‌మిళ‌, క‌న్న‌డ భామ‌ల్ని లైన్ లో పెట్ట‌డానికి టీమ్ ప్ర‌య‌త్నిస్తోందట. ఈ నేపథ్యంలో క‌న్న‌డ స్టార్ హీరోయిన్ ర‌చిత రామ్ ని రీసెంట్ గా సంప్ర‌దించార‌ట‌ చిత్ర యూనిట్. అయితే ఈ బ్యూటీ కూడా ఆలోచించి చెబుతా అని హోల్డ్ పెట్టిందని సమాచారం. ఊరంతా తిరిగి ఇంటెనక చావ‌డం అంటే ఇదే క‌దా. వాస్తవానికి రవితేజకి ఒక్కడికే హీరోయిన్స్ కష్టాలు ఉన్నాయంటే పొరపాటే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలదీ ఇదే పరిస్థితి. వరుస ప్లాపులు ఉండటం వల్ల కొంతమంది నటించడానికి ఇంటరెస్ట్ చూపించపోతుంటే.. మరికొందరు సీనియర్ హీరోల పక్కన అని ముందుకు రావడం లేదట. ఇదిలా ఉండగా రవితేజ ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఒక చిత్రం చేయబోతున్నాడట. ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మాస్ మహారాజ్ రవితేజ కొత్త కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలో త్రినాథరావు చెప్పిన ఈ కథ రవితేజకు బాగా నచ్చిందని.. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.


Tags:    

Similar News