మెగాస్టార్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న..!

Update: 2021-04-02 13:00 GMT
సినిమా ఇండ‌స్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్య‌మో.. అదృష్టం కూడా అంత‌క‌న్నా ముఖ్యం అంటుంటారు. ర‌ష్మిక మంద‌న్న‌ను చూస్తే నిజ‌మే అనిపిస్తుంది. ఓ చిన్న హీరో ప‌క్క‌న న‌టించి, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి  ప్ర‌వేశించిన ర‌ష్మిక‌.. వెంట వెంట‌నే భారీ ఆఫ‌ర్లు చేజిక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ పొజిష‌న్లో కొన‌సాగుతోంది.

ఇక్క‌డ జోరు కొన‌సాగిస్తూనే.. అటు బాలీవుడ్లో, కోలీవుడ్లో ఎంట్రెన్స్ టెస్టులు రాస్తోంది. త‌మిళ్ హీరో కార్తీ స‌ర‌న న‌టించిన డెబ్యూ మూవీ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తోనే న‌డుస్తోంది. అటు సిద్దార్థ్ మ‌ల్హోత్ర స‌ర‌స‌న నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అయితే.. అది సెట్స్ పై ఉండ‌గానే బాలీవుడ్లో మ‌రో ఆఫ‌ర్ వ‌రించిందీ బ్యూటీని. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ర‌ష్మిక‌. ఏక్తాక‌పూర్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గుడ్ బై' చిత్రంలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.

ఈ చిత్రానికి ఈ రోజే కొబ్బరికాయ కొట్టారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది ర‌ష్మిక మంద‌న్నా. గుడ్ బై సినిమాలో భాగ‌స్వామిని అయినందుకు త‌న‌కు చాలా ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటూ రాసుకొచ్చింది ర‌ష్మిక‌. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క‌టి స‌క్సెస్ అయినా.. ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డం ఖాయం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News