'బిగ్ బ్రదర్' అంటూ మహేష్ పట్ల అభిమానాన్ని చాటుకున్న రణ్‌ వీర్..!

Update: 2020-12-26 07:50 GMT
ఆరడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు మహేష్. ఇప్పటికే పలు పెద్ద బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించిన మహేష్.. ప్రముఖ శీతలపానీయం బ్రాండ్ థమ్స్‌ అప్ కి అంబాసిడర్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక థమ్స్‌ అప్ ప్రకటనల్లో పాల్గొన మహేష్ ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ తో కలిసి యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మహేష్ తో కలసి ఉన్న ఫోటోని జత చేశాడు.

మహేష్‌ బాబు ఒక జెంటిల్ మ్యాన్ అని.. అతనితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందంటూ రణ్‌ వీర్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మహేష్‌ బాబుని ‘బిగ్ బ్రదర్’ అని సంబోధిస్తూ మహేష్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు రణ్‌ వీర్ సింగ్. దీనికి ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇచ్చిన మహేష్.. నీతో కలిసి వర్క్ చేయడం బాగుందని.. ఇద్దరికీ ఒకే ఫీలింగ్ అని పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో మహేష్ - రణవీర్ కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. కాగా, మహేశ్ - రణ్‌ వీర్‌‌ ముంబైలో యాడ్ షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో ఇద్దరూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియాడ్ వాలా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాక్ నడిచింది. ఇదే కనుక నిజమైతే మహేశ్ - రణ్‌ వీర్‌‌ క్రేజీ కాంబో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
Tags:    

Similar News