పిక్‌ టాక్‌ : కలయిక వెనుక కారణం ఏంటో?

Update: 2020-01-03 06:45 GMT
పవన్‌ కళ్యాణ్‌.. త్రివిక్రమ్‌ లు మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో చివరిగా వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్‌ కు ప్రస్తుతానికి అదే చివరి చిత్రం. ఆ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పింక్‌ రీమేక్‌ తో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇదే సమయంలో పవన్‌ ఇతర సినిమాలను కూడా చేస్తాడనే చర్చ జరుగుతోంది.

ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ను త్రివిక్రమ్‌ వెళ్లి కలవడం చర్చకు తెర లేపింది. వీరిద్దరి కాంబోలో ఇంకా సినిమాలు వస్తాయని ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. గతంలో ఒక ప్రాజెక్ట్‌ ను ప్రకటించి పక్కకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ ను ఏమైనా మొదలు పెడతారా లేదంటే ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు వీరిద్దరి మద్య జరిగాయా అంటూ ప్రస్తుతం సోషల్‌ మీడియా లో పుకార్లు గుప్పుమంటున్నాయి.

అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు అవ్వాలంటూ ఆహ్వానించేందుకు త్రివిక్రమ్‌ పవన్‌ ను కలిసి ఉంటాడని మొదట అనుకున్నారు. కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అంటూ వీరిద్దరి కాంబో సినిమా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి పవన్‌ మరియు త్రివిక్రమ్‌ లు కలవడం.. ఏదో విషయమై చర్చించారు అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ఇష్యూ అయ్యింది. ఇంతకు వారిద్దరి మద్య జరిగిన చర్చ ఏంటీ అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కాని తెలియదు. ఒకవేళ వీరిద్దరి కాంబో మూవీ గురించి చర్చ జరిగి ఉంటే మాత్రం ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు ఉండవు.


Tags:    

Similar News