ఆత్మహత్య అంటే మండిపడుతున్న బ్యూటీ

Update: 2020-06-21 07:10 GMT
హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మరణంతో సెలబ్రెటీలు కూడా చాలా మంది తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో మంది స్టార్స్‌ కూడా డిప్రెషన్‌ లో మగ్గుతున్నట్లుగా సుశాంత్‌ మరణం తర్వాత వెళ్లడయ్యింది. ఆత్మహత్య అంటేనే సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ మరణంతో ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ కూడా చాలా బాధకు గురయ్యిందట. ఆమె గత మూడు నాలుగు రోజుగా సోషల్‌ మీడియాలో కూడా కనిపించలేదు.

ఎట్టకేలకు మళ్లీ పాయల్‌ రాజ్‌ పూత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. సుశాంత్‌ మరణం తర్వాత కొందరు తాము కూడా డిప్రెషన్‌ లో ఉన్నాం ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటూ పాయల్‌ రాజ్‌ పూత్‌ వాల్‌ పై పోస్ట్‌ చేశారట. అందులో ఒకరి ట్వీట్‌ కు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వెళ్లి చావు.. అది నీ నిర్ణయం కాని నీ సమస్యకు ఆత్మహత్య ఎలా పరిష్కారం అవుతుందో ఆలోచించు. ఏ సమస్యకు కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అంటూ అతడికి పాయల్‌ సూచించింది.
Tags:    

Similar News