150 కేజీల డెడ్ లిఫ్ట్.. సామ్‌కు ఏమాత్రం ఆకలి తగ్గలేదట
డెడ్ లిఫ్ట్ లేదా లెగ్ ప్రెస్ తో తన థై సౌందర్యాన్ని కాపాడుకుంటున్న సమంత స్టాటిస్టిక్స్ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి.;
సమంత రూత్ ప్రభు.. కేవలం వెండితెరపై మెరిసే తార మాత్రమే కాదు.. అంతకుమించిన కఠిన శ్రమకు నిదర్శనం. ఇటీవల తన వర్కవుట్ సెషన్‌లో భాగంగా ఏకంగా 150 కేజీల బరువును ఎత్తడం చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. కేవలం తన థైస్ కోర్ బలాన్ని ఆధారంగా చేసుకుని అంత బరువును సునాయాసంగా లిఫ్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. మైయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని కూడా.. ఫిట్‌నెస్ విషయంలో సామ్ చూపిస్తున్న పట్టుదల చూస్తుంటే `ఫిట్‌నెస్ ఫ్రీక్` అనే బిరుదు సరిగ్గా అతికినట్లు సరిపోతుందనిపిస్తోంది.
డెడ్ లిఫ్ట్ లేదా లెగ్ ప్రెస్ తో తన థై సౌందర్యాన్ని కాపాడుకుంటున్న సమంత స్టాటిస్టిక్స్ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. డెడ్ లిఫ్ట్ చేయడం ద్వారా థై సొగసుతో పాటు వెనక భాగం అందాలు మరింత కర్వీగా తీర్చిదిద్దడం సాధ్యపడుతుంది. సామ్ ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఉన్న ఈ వీడియో వైరల్ గా షేర్ అవుతోంది. ఈ వీడియోతో పాటు సామ్ తన 16 ఏళ్ల సినీప్రయాణం గురించి ఇన్ స్టాలో వివరించింది.
16 ఏళ్ల ప్రయాణం.. ఫిబ్రవరి కనెక్షన్!
సమంత సినీ ప్రస్థానం మొదలై ఇప్పటికి సరిగ్గా 16 ఏళ్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరితో విడదీయలేని అనుబంధం ఉంది. సమంత కథానాయికగా పరిచయమైన క్లాసిక్ లవ్ స్టోరీ `ఏమాయ చేశావే` విడుదలైనది 2010 ఫిబ్రవరి 26న. అంటే.. పదహారేళ్ల క్రితం అదే ఫిబ్రవరి నెలలో ఒక మెరుపులా మెరిసిన జెస్సీ.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. తన 16 ఏళ్ల కెరీర్ మైలురాయిని పురస్కరించుకుని తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సమంత రూత్ ప్రభు తన సినీ ప్రస్థానంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ఫిబ్రవరి నెలకు తన జీవితంలో ఉన్న ప్రత్యేకతను చాటుతూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నటిగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్నా కానీ తనలో నటనపై ఉన్న ఆకలి ఏమాత్రం తగ్గలేదని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటూ షేర్ చేసిన భావాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన స్నేహితురాలు క్రెషా బజాజ్ 2017లోనే ఊహించిన ఎన్నో అద్భుతాలు ఇప్పుడు తన జీవితంలో నిజమవుతున్నాయని సమంత ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కేవలం వెండితెరకే పరిమితం కాకుండా.. ఒక పారిశ్రామికవేత్తగా తన సొంత బ్రాండ్ `ట్రూ* స్మా`ను విజయవంతంగా నడిపించాలన్నది తన కల అని సమంత వెల్లడించారు. ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకుండా.. పికిల్ బాల్ ఆడటం.. జిమ్‌లో గడపడం వంటి చిన్న చిన్న విషయాల్లోనే అసలైన ఆనందాన్ని వెతుక్కుంటానని సమంత తెలిపారు. తన విజయాల వెనుక నిరంతరం శ్రమించే బెస్ట్ టీమ్ ఉందని.. షూటింగ్ సెట్లే తన హ్యాపీ ప్లేస్ అని పేర్కొంటూ తన టీమ్ పై కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. అలాగే తన చర్మ సౌందర్య రహస్యాల కోసం ఉపయోగించే క్రీమ్స్ గురించి ప్రచారం చేసారు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దేవుడిపైనా తన ఆత్మవిశ్వాసంపైనా ఉన్న విశ్వాసమే తనను ముందుకు నడిపిస్తోందని సమంత ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తన వయస్సు పెరుగుతున్నా.. లోపల ఎప్పుడూ ఒక చిన్నపిల్లలాగే ఉంటానని.. తన వ్యక్తిత్వంలో ఆ స్వచ్ఛతను కాపాడుకోవడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.
`ఫెల్ట్ క్యూట్.. లుకింగ్ సీరియస్` అంటూ తమాషాగా మొదలుపెట్టి..150 కేజీల బరువును ఎత్తే ఫిట్‌నెస్ ఫ్రీక్ నుండి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ వరకు సాగిన సమంత ప్రయాణం అందరికీ గొప్ప స్ఫూర్తినిస్తోంది. సమంత తదుపరి రక్త బ్రహ్మాండ్ లో నటిస్తోంది. సొంత నిర్మాణంలో `మా ఇంటి బంగారం` అనే సినిమాని నిర్మిస్తోంది.