పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ.. ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే.. మేకర్స్ కూడా కొత్త కొత్త విషయాలు బయటపెడుతూ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా.. చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ వకీల్ సాబ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ పేరు వకీల్ సాబ్ కాదని చెప్పేశాడు.
వకీల్ సాబ్ మూవీ.. బాలీవుడ్ ‘పింక్’ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. న్యాయం కోసం కన్నీళ్లు పెట్టుకునే మహిళల కథ ఇది. కానీ.. దీన్ని పవన్ టేకప్ చేయడంతో కమర్షియల్ అంశాలు అనివార్యమయ్యాయి. అందులోనూ పవన్ రీ-ఎంట్రీ సినిమా కావడంతో అభిమానులను అలరించే అంశాలు కంపల్సరీ అయ్యాయి.
ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టులో మార్పులు చేసినట్టు చెబుతున్నారు శ్రీరామ్ వేణు. అయితే.. పింక్ మూలం మాత్రం అలాగే ఉందని, ఆత్మను కొనసాగిస్తూనే.. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను అల్లుకున్నట్టు చెప్పారు. ముగ్గురు మహిళల కోణం నుంచి మొదలై.. పవన్ సెంటర్ స్టేజ్ తీసుకునేలా చిత్రం సాగుతుందని అన్నారు.
అయితే.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పేరు వకీల్ సాబ్ కాదని చెప్పారు దర్శకుడు. ఆయన క్యారెక్టర్ యాక్చువల్ పేరు ‘సత్యదేవ్’ అనీ.. అయితే, పక్కన ఉన్నవాళ్లు మాత్రం వకీల్ సాబ్ అని పిలుస్తుంటారని తెలిపారు. అయితే.. వకీల్ సాబ్ అని ఎందుకు పిలవాల్సి వస్తుందో సినిమా చూశాక అర్థమవుతుందని అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.