ప‌ద్మ‌వ్యూహం లిరిక్ ఎమోష‌న‌ల్ ట్రీల్.. సుశాంత్ ఈసారి కొట్టేస్తాడా?

Update: 2021-02-27 04:30 GMT
తెలుగు ప్రేక్ష‌కుడి మైండ్ సెట్ మారింది. కాలంతో పాటు వ‌చ్చిన మార్పు ఇది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమాల్ని వైవిధ్యంగా చూపిస్తామంటేనే జ‌నం య‌థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కాలం చెల్లి కొత్త జోన‌ర్ల‌తో ప్ర‌యోగాలు చేసేందుకు ఇది ఆస్కారం క‌ల్పించింది. మంచి క‌థ.. అంతే  గ్రిప్పింగ్ క‌థ‌నం .. గొప్ప మాట‌లు ఉంటేనే జ‌నాల‌కు ఎక్కుతున్నాయి.

ఇవ‌న్నీ నెమ్మ‌దిగా ఔపోష‌ణ ప‌ట్టి ఈసారి సుశాంత్ తెలివిగానే ప్లాన్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. సుశాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు` టైటిల్ స‌హా తొలి పోస్ట‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచి క్యూరియాసిటీ పెంచుతూనే ఉంది. ఆరంభం టైటిల్ ఆక‌ట్టుకుంది. ఇక ఇప్ప‌టికే దీనికి సంబంధించిన పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన‌ప్పుడు దానికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా `ప‌ద్మ‌వ్యూహం...` సింగిల్ రిలీజైంది. ఈ విజువ‌ల్ సాంగ్ ‌ ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. సుశాంత్ మీడియా యువ‌కుడిగా క‌నిపిస్తుండ‌గా.. అత‌డిపై దాడికి దిగుతూ అఘాయిత్యాల‌కు పాల్ప‌డే దుష్ఠ‌శ‌క్తుల క‌థేమిటి?  ఇంత‌కీ ఈ ప‌ద్మ‌వ్యూహం నుంచి అత‌డు బ‌య‌ట‌పడ్డాడా లేదా? అన్న‌ది తెర‌పైనే చూడాలి. నేరాలు ఏమీ చేయ‌ని వారిని తీరం చేర్చే పూచీ నాద‌నీ.. అన్న లైన్ తోనే జ‌ర్న‌లిస్టుల‌పై దాష్ఠీకాల్ని చూపిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ట్రై చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. కాలభైర‌వ గానం ఎమోష‌న‌ల్ గా సాగ‌గా.. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం ఉద్విగ్న‌త‌న పెంచింది.

ఇందులో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వెన్నెల కిషోర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. వెంకట్‌- ప్రియదర్శి- అభినవ్‌ గోమటం, ఐశ్వర్య- రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. రవిశంకర్‌ శాస్రి- హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.Full View
Tags:    

Similar News