యూట్యూబ్‌లో ఆస్కార్ స్ట్రీమింగ్ కానీ...!
వరల్డ్ వైడ్‌గా సినీ రంగాల వారు ఆస్కార్ అవార్డుల్ని అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తుంటారు. సినీ స్టార్స్ కయితే ఆస్కార్ ఓ కల.;
వరల్డ్ వైడ్‌గా సినీ రంగాల వారు ఆస్కార్ అవార్డుల్ని అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తుంటారు. సినీ స్టార్స్ కయితే ఆస్కార్ ఓ కల. ఎప్పటికైనా కెరీర్‌లో ఆస్కార్‌ని దక్కించుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆ అవకాశం కోసం ఆశపడుతుంటారు. ఇక ఈ అవార్డుల వేడుకని కళ్లారా చూసేందుకు కోట్లాది మంది సినీ ప్రియులు ఎదురు చూస్తుంటారు.
కొడాక్ థియేటర్‌లో తారళ తళుకుల కోళాహలం మధ్య ప్రతి ఏటా జరిగే ఈ వేడుకని ప్రత్యక్షంగా టీవీల్లో వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు వేచిచూస్తుంటారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు వచ్చాక వాటిల్లో ఆస్కార్ వేడుక క్లిప్‌లు, కీలక ఘట్టాలకు సంబంధించిన వీడియో స్పీచ్‌లు చూడటం, ట్వీట్‌లపై ఆధారపడటం అలవాటుగా మారింది. అయితే తాజాగా ఆస్కార్ అకాడమీ అవార్డుల్ని వీక్షించాలనుకునే సినీ ప్రియులకు ఆస్కార్ టీమ్ నుంచి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.
ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని య్యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. అయితే ఈ ఏడాది నుంచి కాదండోయ్ మూడేళ్ల తరువాత నుంచి అకాడమీ అవార్డ్స్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసింది. 1976 నుంచి ఆస్కార్ అవార్డ్స్ స్ట్రీమింగ్ హక్కులు `ABC`వద్దే ఉన్నాయి. 2028లో జరిగే ఆస్కార్ అకాడమీ అవార్డులు వేడుక తరువాత నుంచి యూట్యూబ్‌లో ఈ ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.
ఈ మేరకు 2028 నుంచి 2033 వరకు యూట్యూబ్‌కు ప్రత్యేకమైన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కుల్ని కల్పిస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఒప్పందంపై సంతకం చేసింది. మరోబ మూడేళ్ల తరువాత ఈ వేడుకని యూట్యూబ్‌లో ఉచితంగా సినీ ప్రియులు వీక్షించ వచ్చు. ఇందులో రెడ్ కార్పేట్ కవరేజీ నుంచి తెర వెనుక విశేషాల వరకు వీక్షకులు వీక్షించవచ్చు.
ఇదిలా ఉంటే 98వ అకాడమీ అవార్డ్స్ వేడుక 2026 మార్చి 15న జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ కోసం పోటీపడుతున్న సినిమాల జాబితాను జనవరి 22న ప్రకటించనున్నట్టు అకాడమీ వర్గాలు వెల్లడించాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 98వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు వడుదలైన సినిమాలు ఇందులో పోటీపడనున్నాయి. ఈ ఈవెంట్‌ని క్యాష్ చేసుకోవాలనే ప్లాన్‌ని సిద్ధం చేసుకున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలు ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలని భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.