ర‌ణ్‌వీర్ 'ధురంధ‌ర్' ఓ దుర్మార్గ‌మైన‌ సినిమానా?

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్‌`. ఆదిత్య ధ‌ర్ అత్యంత సాహ‌సోపేతంగా తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌రల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.;

Update: 2026-02-02 16:30 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్‌`. ఆదిత్య ధ‌ర్ అత్యంత సాహ‌సోపేతంగా తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌రల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 5న విడుద‌లై అనూహ్యంగా మౌత్ టాక్‌తో స‌రికొత్త రికార్డులు సృష్టించింది. విమ‌ర్శ‌కులు ప్రాప‌గండ ఫిల్మ్ అని, ప్రొ ఇండియా ఫిల్మ్ అని, యాంటీ పాకిస్థాన్ న‌రేటివ్ అని కామెంట్‌లు చేసినా దీని ర్యాంపేజ్‌ని అడ్డుకోలేక‌పోయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.1340 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ మూవీ రిలీజ్ త‌రువాత హీరో హృతిక్ రోష‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డం దానిపై ట్రోలింగ్ జ‌ర‌గ‌డంతో వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్న హృతిక్ త‌న వ్యాఖ్య‌ల‌ని వెన‌క్కి తీసుకోవ‌డం తెలిసిందే. ఆ త‌రువాత బాలీవుడ్ క్రిటిక్స్ కొంత మంది `ధురంధ‌ర్‌`పై విషం చిమ్మే ప్ర‌య‌త్రం చేశారు కానీ ఎక్క‌డా అది వ‌ర్క‌వుట్ కాక‌పోగా సినిమాకు మ‌రింత ఫ్రీ ప‌బ్లిసిటీని తెచ్చి పెట్టింది. సినిమాకు మంత‌గా ప్ర‌చారాన్ని క‌లిగించి మ‌రింత మందికి చేరువ‌య్యేలా చేసింది. విమ‌ర్శ‌లు, సెల‌బ్రిటీల ప్ర‌శంస‌ల నేప‌థ్యంలో `ధురంధ‌ర్` టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.

రామ్ గోపాల్ వ‌ర్మ అయితే ఈ మూవీపై మ‌న‌సు పారేసుకుని నిత్యం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఓ లేడీ డైరెక్ట‌ర్ తాజాగా విష‌యం చిమ్మ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. `ధడ‌క్ 2` డైరెక్ట‌ర్ షాజియా ఇక్బాల్ `ధురంధ‌ర్‌` సినిమాపై తాజాగా అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. ఇదొక పాపిష్ఠి సినిమా అంటూ హేళ‌న చేసింది. `ఇదొక దుర్మార్గ‌పు సినిమా. దాచ‌బ‌డింది కాదు..అనుకోకుండా జ‌రిగింది కాదు.ద్వేషాన్ని, హింస‌ను రెచ్చ‌గొట్ట‌డం ఈ సినిమా డీఎన్ ఏలోనే ఉంది` అని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది.

అంతే కాకుండా `ఇది వెల్ మేడ్ ఫిల్మ్ అని ప్ర‌శంసిస్తూనే సినీ ప‌రిశ్ర‌మ‌లోని మిత్రులారా..! మీలో చాలా మంది మైనారిటీల గురించి క‌నీసం వారిపై మీకున్న నిర్ల‌క్ష్యాన్ని దాచ‌డానికైనా వెనుకాడ‌నందుకు చాలా సంతోషంగా ఉంది` అని `ధురంధ‌ర్‌`పై త‌న‌కున్న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కింది. బాలీవుడ్‌లో ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన షాజియా ఇక్బాల్ త‌మిళ హిట్ ఫిల్మ్ `పెరియారుమ్ పెరుమాళ్‌` ఆధారంగా `ధ‌డ‌క్ 2`ని రీమేక్ చేసింది. సిద్ధాంత్ చ‌తుర్వేది, త్రిప్తి దిమ్రి జంట‌గా న‌టించారు.

క‌ర‌ణ్ జోహార్‌,ఆదార్ పూనావాలాతో క‌లిసి మ‌రి కొంత మంది నిర్మించిన ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా ఉంటే షాజియా ఇక్బాల్ `ధురంధ‌ర్‌`పై చేసిన కామెంట్స్‌పై నెట్టింట విమర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇండియాలో ఉంటూ ఇండియ‌న్ మూవీపై విమ‌ర్శ‌లు చేస్తున్నావ‌ని నెటిజ‌న్‌లు మండిప‌డుతున్నారు. అయితే కొంత మంది మాత్రం వైర‌ల్ కావాల‌నే షాజియా ఇక్బాల్ `ధురంధ‌ర్‌`పై ఇన్ని రోజుల త‌రువాత కామెంట్‌లు చేసింద‌ని, త‌న‌ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News