బాయ్ ఫ్రెండ్ & లవ్.. ఓపెన్ అయిన మృణాల్..

అతను బ్రేకప్ చెప్పినప్పుడు బాధ కంటే ఆశ్చర్యమే ఎక్కువగా అనిపించిందని మృణాల్ చెప్పారు.;

Update: 2026-02-02 18:28 GMT

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకవైపు కొత్త సినిమా రిలీజ్‌ కు రెడీ అవుతుండగా… మరోవైపు తన పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దో దీవానే శహర్ మే సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ తన లవ్ లైఫ్ గురించి ఓపెన్‌ గా మాట్లాడారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పిన మృణాల్.. కెరీర్‌ విషయంలో తాను ఎప్పుడూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. అయితే అదే తన రిలేషన్‌ షిప్‌ కు బ్రేక్ పడటానికి కారణమైందని వెల్లడించారు. "నువ్వు చాలా ఇంపల్సివ్‌ గా ఉంటావ్.. నీ దూకుడు హ్యాండిల్ చేయలేను.. నువ్వు హీరోయిన్‌ కావడం కూడా నాకు నచ్చడం లేదు" అంటూ తన మాజీ బాయ్ ఫ్రెండ్ చెప్పిన మాటలను ఆమె గుర్తుచేసుకున్నారు.

అతను బ్రేకప్ చెప్పినప్పుడు బాధ కంటే ఆశ్చర్యమే ఎక్కువగా అనిపించిందని మృణాల్ చెప్పారు. "ఆ రిలేషన్ షిప్ బ్రేకప్ అవ్వడం నా మంచికే. అలాంటి మైండ్‌ సెట్ ఉన్న వ్యక్తితో భవిష్యత్తులో జీవితం కష్టమయ్యేది. పిల్లలు కూడా అదే ఆలోచనలతో పెరుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు" అంటూ స్పష్టం చేశారు. అందుకే విడిపోవడాన్ని నెగటివ్ గా తీసుకోలేదని, జీవితంలో ముందుకు వెళ్లడమే ముఖ్యమని తెలిపారు.

ఇక గత కొంతకాలంగా మృణాల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది. తమిళ స్టార్ హీరో ధనుష్‌ తో డేటింగ్ చేస్తున్నారంటూ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఇప్పటికే ఖండించారు. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అలాగే టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ తోనూ రిలేషన్‌ లో ఉన్నారన్న రూమర్లను కూడా కొట్టిపారేశారు.

"ఇలాంటి వార్తలు ఫన్నీగా ఉంటాయి. కొన్నిసార్లు ఇవే ఫ్రీ పీఆర్‌ లా పనిచేస్తాయి" అంటూ నవ్వేశారు. ఇప్పుడు కెరీర్‌ పైనే పూర్తి దృష్టి పెట్టిన మృణాల్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం దో దీవానే శహర్ మే.. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి ఉద్యవర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మృణాల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను ధైర్యంగా చెప్పిన మృణాల్, కెరీర్‌ లో మాత్రం మరింత స్ట్రాంగ్‌ గా ముందుకు సాగుతుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఆమె ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News