సక్సెస్ అయితే అతడిపై మెగాస్టార్ కర్చీప్ ముందే!
మారుతితో ఓ సినిమా చేస్తానని మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితమే ప్రామిస్ చేసారు. మారుతి సక్సస్ లు చూసి మెగాస్టార్ ఇచ్చిన మాట అది.;
మారుతితో ఓ సినిమా చేస్తానని మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితమే ప్రామిస్ చేసారు. మారుతి సక్సస్ లు చూసి మెగాస్టార్ ఇచ్చిన మాట అది. కానీ ఆ కాంబినేషన్ ఇంకా చేతులు కలపలేదు. చిరంజీవి వేర్వేరు దర్శకులతో.. మారుతి వేర్వేరు హీరోలతో పని చేస్తున్నారు తప్ప! వాళ్లిద్దరు మాత్రం ఇంకా కలవలేదు. కానీ చిరు చేసిన ఈ ప్రకటనతోనే మారుతి ఎంతో సంతోష పడ్డాడు. మారుతి లో దర్శకుడిని బయటకు తెచ్చింది కూడా చిరంజీవీనే. ప్రజారాజ్యం పార్టీ సమయలో జెండా డిజైన్ చేసింది మారుతి కావడంతో? అతడి క్రియేటివిటీని గురించి నీలాంటి వాళ్లు క్రియేటివ్ రంగంలో ఇంకా ఎదగాలని ప్రోత్సహించడంతో? మారుతి సినిమాల్లోకి రావడం..దర్శకుడు అవ్వడం జరిగింది.
లెజెండరీతో ఛాన్స్:
మారుతి ఇప్పుడు ఓ సక్సెస్ పుల్ డైరెక్టర్. అయితే చిరంజీవి తో ఛాన్స్ అన్నది అంత సులభం కాదు. అతడు చాలా పెద్ద స్టార్. కోట్లాది మంది అభిమానించే ఓ లెజెండరీ నటుడు. అలాంటి స్టార్ ని డైరెక్ట్ చేయాలంటే? మారుతి కూడా అన్ని రకాలుగా సిద్దమవ్వాలి. అంతకు ముందు చిరంజీవి అతడిని తనను మించి నమ్మాలి. అందుకే ఇదే సమయం కూడా. ప్రస్తుతం మారుతి ప్రభాస్ హీరోగా `రాజాసాబ్ `చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమా విజయం సాధిస్తే గనుక చిరంజీవి కళ్లు మూసుకుని మారుతికి ఛాన్స్ ఇచ్చేస్తారు.
సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్లు:
చిరంజీవి కూడా ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ఎవరు సక్సెస్ ల్లో ఉన్నారో? చూసుకుని కమిట్ అవుతున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటున్నారు. అనీల్ రావిపూడి కూడా మెగా కాంపౌండ్ లో అలాగే ఎంటర్ అయిన వారే. అనీల్ వరుస సక్సస్ లు చూసి చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చారు. కథ ఇలా ఉండాలి? అని హింట్ కూడా ఇచ్చారు. ఆయన టేస్ట్ కు తగ్గట్టు `మన శంకర వరప్రసాద్ గారు`ని మలిచారు. `రాజాసాబ్` హిట్ అయితే? మారుతి మరింత బిజీ అవుతాడు. అతడి వైపు పాన్ ఇండియా స్టార్లు కూడా చూసే అవకాశం ఉంటుంది.
మధ్యలోనే అగ్రిమెంట్:
కాబట్టి అంతకు ముందే చిరంజీవి కర్చీప్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నయ్య పిలిస్తే ఆ మహా ప్రసాదాన్ని కాదనేది ఎవరు? మారుతి కళ్లకు నమస్కరించి ఛాన్స్ తీసుకుంటాడు. అందుకు 2026 వేదిక అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి, బాబితో మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఇదే ఏడాది పూర్తి చేసి రిలీజ్ చేస్తారు. మధ్యలో `విశ్వంభర` కూడా రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలోనే మారుతితో అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది.