బ్లాస్టింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న నిధి అగర్వాల్..
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.;
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నిధి అగర్వాల్ తో పాటు రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పైగా మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా నుండి సహనా పాట విడుదల చేశారు.
అలా ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది నిధి అగర్వాల్. బేబీ పింక్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా ఈ డ్రెస్ లో కుర్రకారును బ్లాస్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈమెను ఇలా చూసి అమ్మడి అందాన్ని తట్టుకోవడం కష్టమే అంటూ తమదైన శైలిలో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.
ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ ఇటీవల అసౌకర్యానికి గురైన విషయం తెలిసిందే. విషయంలోకి వెళ్తే.. ది రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం వందల మంది అభిమానులు రాగా.. వారంతా నిధి అగర్వాల్తో సెల్ఫీ కోసం ఎగబడడంతో ఆమె అసౌకర్యానికి గురైంది. ఇక మరొకవైపు ఒక మాల్ లో నిర్వహించిన వేడుక పూర్తి అయి.. బయటకు వస్తుండగా ఆమెతో కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తించారు. సంబంధిత వీడియో కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఘటనపై కేపిహెచ్బి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా మాల్ ఈవెంట్ నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని.. అనుమతి లేకుండా ఇలాంటి ఈవెంట్లు ఎలా నిర్వహిస్తారో అంటూ ఫైర్ అయ్యారు.
నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ చిత్రాలలో ప్రధానంగా పనిచేసే ఈమె మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొన్న ఈమె ఆ తర్వాత హిందీ చిత్రం మున్నా మైఖేల్ తో తన నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఈ సినిమాతో ఉత్తమ మహిళ అరంగేట్రం విభాగంలో జీ సినీ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత సవ్యసాచి, ఈశ్వరన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.