మరోసారి స్పీచ్ తో అదరగొట్టిన SKN

Update: 2023-02-17 09:47 GMT
తిరుపతి నేపథ్యంలో సాగే కథనంతో కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరోభాగ్యము విష్ణుకథ' సినిమా రూపొందింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించారు. కశ్మీర కథానాయికగా నటించిన ఈ సినిమా..ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా అక్కినేని అఖిల్ హాజరై సందడి చేశారు.

ఈ వేడుకను ఉద్దేశించి నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. "అక్కినేని వంశాభిమానులకు నా ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన అఖిల్.. ఏజెంట్ తో భారీ హిట్ కొడతారు అని అనుకుంటున్నాను. అలాగే కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కి కూడా నా కృతజ్ఞతలు. అల్లు అరవింద్ గారు ఇచ్చిన అడ్వాన్సుల గురించి ఆలోచించరు సినిమాని అడ్వాన్స్ గా ఎలా తీయాలి అనే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇలాంటి నిర్మాతలు మాకు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇక బన్నీ బాస్ తన జడ్జిమెంట్ ని నమ్మి ముందుకు వెళ్తారు. అలానే ఈ సినిమాను కూడా నమ్మి తెరకెక్కించారు.

శివరాత్రి బాక్సాఫీస్ కు నవరాత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక కిరణ్ అబ్బవరం పసిబిడ్డల కనిపించే కసిబిడ్డ. ఈ సినిమా రేపటి నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది. ఇప్పటివరకు ట్రైలర్ టీజర్ లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో అసలు మ్యాటర్ ఉంటుంది. సినిమా భారీ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.

ఇంకా ఈ సినిమాకు పనిచేసిన భరద్వాజ్ కూడా ఉన్నత స్థాయికి వెళ్తాడని ఆశిస్తున్నాను. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఇక అరవింద్ గారు మమ్మల్ని తమ పిల్లలుగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఆయన సినిమాలు బాగా ఆడాలని ఆశిస్తున్నాను." అని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు.

కాగా, తిరుమల తిరుపతి నేపథ్యంలో సాగే ఆసక్తికర కథతో రూపొందిందీ చిత్రం. ఈ సినిమాకు చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూర్చగా.. డేనియల్‌ విశ్వాస్‌ ఛాయాగ్రహణం అందించారు. బన్నీ వాస్‌ నిర్మాతగా వ్యవహరించగా అల్లు అరవింద్‌ సమర్పించారు.

ఇక సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఫిబ్రవరి 17న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు నిర్మాత బన్నీ వాస్ స్పష్టం చేశారు. ప్రసాద్, ఏఎంబి, కూకట్ పల్లి నెక్సస్ లో సినిమా వేస్తున్నట్లు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News