'U' బేబీ.. కుటుంబ ప్రేక్షకులకు పెద్ద ఊరట!

Update: 2019-07-04 05:24 GMT
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఓ బేబీ'.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి బుధవారం నాడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  సెన్సార్ వారు 'ఓ బేబీ' కి క్లీన్ 'U' సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసే చిత్రమని తేలిపోయింది. ఇది ' ఓ  బేబీ సినిమాకు ప్లస్సే.

సెన్సార్ సర్టిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 'ఓ బేబీ' టీమ్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  క్లీన్ U సర్టిఫికేట్ వచ్చిందని పోస్టర్ లోనే తెలుపుతూ.. పోస్టర్లో సమంతా ఫుల్ జోష్ లో నవ్వుతూ ఉంది.  పోల్కా డాట్స్ ఉన్న పసుపు రంగు ఫుల్ షర్టు.. వైట్ ప్యాంట్ ధరించి.. ఆ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఒక గొడుగు పట్టుకుని.. భుజానికి ఒక స్టైలిష్ బ్యాగ్ తగిలించుకుని చెంగుచెంగుమని ఎగురుతూ వస్తోంది.  ఈమధ్య సినిమాల్లో లిప్పు లాకుల దెబ్బకు కుటుంబ ప్రేక్షకులు బెంబేలెత్తుతున్నారు. హీరో హీరోయిన్లు అదేపనిగా  మూతులను నాక్కోవడం చూస్తే ఆ చిన్నపిల్లలు ఏం ప్రశ్నలు అడుగుతారో.. వాటికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక చిన్న పిల్లలను న్యూ జెన్ ఫిలిమ్స్ కు తీసుకుపోవడం లేదు.   మరి ఈ సినిమా క్లీన్ U కావడం ఆ ప్రేక్షకులకు కూడా పెద్ద ఊరట!!!

నాగశౌర్య ఈ చిత్రంలో సమంతాకు జోడీగా నటించాడు. లక్ష్మి.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్.  'మిస్ గ్రానీ' అనే కొరియన్ సూపర్ హిట్ ఫిలిం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ప్రోమోస్ ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.  దీంతో సమంతా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడం ఖాయమని అంచనాలు ఉన్నాయి.
Tags:    

Similar News