అవినీతి రాజకీయనాయకులపై ఎన్టీఆర్ పోరాటం!
ఎన్టీఆర్ లో ఆవేశం కనిపిస్తుంది .. ఆ ఆవేశం వెనుక ఒక ఆలోచన కని పిస్తుంది. ఎన్టీఆర్ మంచి మాటకారి .. తన మాటలతో అవతలవారిని ప్రభావితం చేయగల సమర్థుడు. తాను అనుకున్న విషయంపై అందరూ స్పందించేలా ప్రేరేపించగలడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని జనంలోకి నేరుగా తీసుకెళ్లగలడు .. సూటిగా చెప్పగలడు. అందువల్లనే ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకున్నారు. ఆ దిశగా ఎన్టీఆర్ కొంతదూరం అడుగులు వేసినట్టుగా కనిపించాడు కూడా. కానీ ఆ తరువాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో కూడా ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఆ గొడవలోకి ఆయనను కూడా లాగుదామని చూశారు. కానీ అప్పుడు కూడా ఎన్టీఆర్ మౌనం వహించాడు. దాంతో ఆయన ఇక రాజకీయాలపై ఆసక్తిని చూపడం లేదనే విషయం చాలామందికి అర్థమైపోయింది. ఆయన ఇప్పుడు సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాడు. వరుసగా భారీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే బయట రాజకీయాలపై ఎంతమాత్రం దృష్టి పెట్టని ఎన్టీఆర్, కొరటాల సినిమాలో మాత్రం అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టే పాత్రలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు.
ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన పోరాడే అంశం ఏదై ఉంటుందనే కుతూహలం అందరిలోను ఉంది. ఈ సినిమాలో ఆయన ఒక బస్తీ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడిగా కనిపిస్తాడట. అంతేకాదు బస్తీలోని పేద విద్యార్థుల హక్కుల కోసం పోరాడే స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని అంటున్నారు.
సహజంగానే కాలేజ్ క్యాంపస్ విషయాల్లో రాజకీయనాయకులు జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే క్యాంపస్ లలో అల్లర్లు జరుగుతుంటాయి. అలా స్టూడెంట్స్ మధ్య అల్లర్లకు కారణమయ్యే అవినీతి రాజకీయకులను ఎదిరించే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నాడని అంటున్నారు. ఎప్పటిలానే కొరటాల వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా సందేశాన్ని అందించే కథ ఇది. కథానాయికలుగా రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. వచ్చేనెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఆరంభ వేడుకకు అల్లు అర్జున్ గెస్టుగా రానున్నాడని అంటున్నారు.