సీట్‌ లో ఎన్టీఆర్!! బాలయ్యను టీజింగా?

Update: 2016-01-06 17:30 GMT
సినిమా ప్రమోషన్స్‌ కోసం ఈసారి కొత్త పుంతలను బాగానే తొక్కుతున్నాడు తారకరాముడు. గతంలో మీడియాకు మోహం చూపించటానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్‌ చూపించని కుర్రాడు.. ఈసారి మాత్రం ఏకంగా పార్టీనే ఇచ్చాడు. కట్‌ చేస్తే.. ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌ ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' షో కోసం గెస్టుగా వస్తున్నాడు.

అసలు ఒక ప్రక్కన ఆ షోలో నాగార్జున తన సొంత సినిమా అయిన ''సోగ్గాడే చిన్ని నాయనా''నే ప్రమోట్‌ చేసుకోవట్లేదు. ఏదో చివర్లో పేర్లు వేసేటప్పుడు ఆ సినిమా పాట ఒకటి వేయడం తప్పించి.. షో లో సినిమా గురించి మాట్లాడింది తక్కువ. అటువంటి సమయంలో ఎన్టీఆర్‌ మాత్రం తన సినిమాను ప్రమోట్‌ చేసుకోవడానికి ఈ షో కి రావడం సూపరే. అయితే గతంలో చాలామంది యాక్టర్లు ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడు కు విచ్చేసి ప్రమోట్‌ చేసుకున్నారులే.

కట్‌ చేస్తే.. ఇక్కడ ఒక పాయింట్‌ గమనించాలి. అసలే నాగార్జునకు బాలయ్యకు ఎప్పుడు చెడిందో తెలియదు కాని.. చెడింది. అందుకే ఒకరి ఇళ్లకు ఒకరు ఎటువంటి కార్యమైనా రావట్లేదు. ఈ సమయంలో మీలో ఎవరి కోటీశ్వరుడు షో లో.. ఎన్టీఆర్‌ రావడమంటే.. బాబాయ్‌ ను బుల్లోడు టీజింగ్‌ సేత్తన్నాడా ఏంటి?
Tags:    

Similar News