ఎన్టీఆర్ కూడా అదే రూట్ లో వెళ్లనున్నాడా...?

Update: 2020-05-06 17:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలు అంటూ విడివిడిగా లేరు. హీరోలే నిర్మాతలు.. నిర్మాతలే హీరోలు. ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు నిర్మాతలుగా మారి నచ్చిన కథలను సొంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరోలందరూ ఎక్కువగా సొంత బ్యానర్లలోనే సినిమాలు చేస్తున్నారు. అయితే వారిలో ఎవరో ఒకరు మాత్రమే సక్సెస్ అవుతుండగా ఎక్కువ శాతం చేతులు కాల్చుకున్న వారే. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలుగా మారడం అన్నది కొత్త అంశమేమీ కాదు. తెలుగు చిత్రసీమ ఆరంభంలోనే ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటివారు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించిన వారే. తరువాతి జనరేషన్ లో చిరంజీవి - నాగార్జున లాంటివారు కూడా సొంత చిత్రాల్లో నటించి అలరించారు. అదే పంథాలో పయనించాలని ఈ జనరేషన్ టాప్ హీరో మహేశ్ బాబు కూడా భావించి 'ఎమ్.బి. - జి.మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్' పతాకంపై మహేశ్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. మహేష్ బాబు నటించే ప్రతి సినిమాకు భాగస్వామిగా ఉంటూ వస్తున్నాడు. అలానే రామ్‌చరణ్ 'కొణిదల ప్రొడక్షన్స్'.. అల్లు అర్జున్ 'గీతా ఆర్ట్స్'.. ప్రభాస్ 'గోపీ కృష్ణ' వంటి నిర్మాణ సంస్థలున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఎక్కువగా బయటి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇకపై తారక్ కూడా రూటు మార్చబోతున్నాడట. తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ స్థాపించిన 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్‌ పై ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను హారికా హాసినీ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయట. ఆ తర్వాత 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కిస్తాడట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తాయట. అంతేకాకుండా భవిష్యత్తులో తను చేయబోయే ప్రతి సినిమాకు 'ఎన్టీఆర్ ఆర్ట్స్' ను భాగస్వామిగా కలపాలని కూడా తారక్ అనుకుంటున్నాడట.
Tags:    

Similar News