కమెడియన్ కోసం స్టార్స్ కదిలారా?
ఏదైనా సమస్య ఎదురైతే మేమంతా ఒకే ఇండస్ట్రీ, ఒకే కుటుంబం.. కళాకారుల కుటుంబం అని టాలీవుడ్ టు బాలీవుడ్ ఆర్టిస్ట్‌లు చెబుతుంటారు.;
ఏదైనా సమస్య ఎదురైతే మేమంతా ఒకే ఇండస్ట్రీ, ఒకే కుటుంబం.. కళాకారుల కుటుంబం అని టాలీవుడ్ టు బాలీవుడ్ ఆర్టిస్ట్‌లు చెబుతుంటారు. ఆ మాటని కొన్ని సందర్భాల్లో పట్టించుకోకున్నా..కొన్ని సందర్భాల్లో నిజం చేసి చూపించారు కూడా. కోర్టు కేసులు, ఆర్టిస్ట్‌ల ఆర్థిక కేసులకు సంబంధించిన మాత్రం ఇంత వరకు ఏ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ముందుకు రాలేదు. అది మన సమస్య కాదని, దాని కోసం వెళ్లడం రిస్క్ అని భావించి సైలెంట్ అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్యపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్ బౌన్స్ కేసు వేయడం తెలిసిందే. తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోగా..వారు ఇచ్చిన కొన్ని చెక్కులుబౌన్స్ అయ్యాయని సదరు సంస్థ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు 2018లో రాజ్‌పాల్ దంపతులను దోషులుగా తేలుస్తూ నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో ఈ శిక్షను సెషన్స్ కోర్టు కూడా సమర్థించడంతో ఈ తీర్పుని సవాల్ చేస్తూ రాజ్‌పాల్ యాదవ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు.
హై కోర్టు ఈ శిక్షపై 2024లో స్టే ఇస్తూ ఇరువురు రాజీపడాలని సూచించింది. అయితే ఫిర్యాదు దారుడికి రాజ్‌పాల్ యాదవ్ డబ్బు తిరిగి చెల్లిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో అతనికి అతనికి జైలు శిక్ష విధిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేసేది లేక ఎవరినీ సహాయం అడగలేక రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలులో లొంగిపోయాడు. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. అంతే కాకుండా నా దగ్గర డబ్బు లేదని, తనకు ఎలాంటి స్నేహితులు లేరని, లొంగిపోవడం తప్ప తనకు మరో మార్గం లేకపోవడంతో లొంగిపోయానని రాజ్‌పాల్ యాదవ్ చెప్పడం అందరిని కలిచివేసింది.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దీనిపై ఎలా స్పందిస్తుందనే చర్చ మొదలైంది. తాజాగా రాజ్‌పాల్ యాదవ్‌ని ఆదుకోవడానికి బాలీవుడ్ కదిలింది. దశాబ్దాల కాలం పాటు తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించిన కమెడియన్ కోసం బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్, సోనూసూద్, దర్శకుడు డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. తను కట్టాల్సిన మొత్తాన్ని తామే కడతామని చెబుతున్నారు. ఈ విషయాన్ని రాజ్‌పాల్ యాదవ్ మేనేజర్ గోల్డీ తాజాగా వెల్లడించారు.
ఈ సమయంలో ఇండస్ట్రీ మొత్తం అతనికి సహాయం చేయడానికి ముందుకొస్తోంది. ఇప్పటికే సోనూసూద్ బహిరంగంగా మద్దుతు తెలిపాడు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ ఈ విషయంలో చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి పని చేస్తున్నారు. కొంత మంది పేర్లు మాత్రమే బయటికి చెబుతున్నాను. అలా అని మిగతా వారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. రాజ్‌పాల్ యాదవ్‌ని ఈ సమస్య నుంచి బయటపడేయాలని ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తమ వంతు సహాయం చేస్తున్నారు` అని తెలిపారు.