జన నాయగన్ మూవీ హాఫ్ టైమ్‌లో షూటింగ్ కానీ సెన్సార్ ఆలస్యం? KVN రియాక్షన్!
ఇంటర్వ్యూలో సెన్సార్ ఆలస్యం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు కేవీఎన్ ప్రొడ్యూసర్ వెంకట్ స్పందిస్తూ ఆసక్తికర సమాధానమిచ్చారు.
తమిళనాడు సీఎం విజయ్ నటించిన 'జన నాయగన్' (జన నాయకుడు) రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, సినిమా సెన్సార్ ప్రక్రియలో జరిగిన తీవ్ర ఆలస్యంపై KVN ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ పూర్తయిన సమయం కంటే, సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పెయిన్‌ఫుల్ టైమ్స్‌లో తను ఎదుర్కొన్న అనుభవాలను ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం..
షూటింగ్ కంటే సెన్సార్‌కే ఎక్కువ సమయం:
ఇంటర్వ్యూలో సెన్సార్ ఆలస్యం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు కేవీఎన్ ప్రొడ్యూసర్ వెంకట్ స్పందిస్తూ ఆసక్తికర సమాధానమిచ్చారు. "మేము ఈ సినిమా షూటింగ్ చేయడానికి తీసుకున్న సమయం కంటే, సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి పట్టిన సమయం రెండు రెట్లు ఎక్కువ" అని తెలిపారు. ఇప్పుడు తాము నవ్వుతూ మాట్లాడుతున్నా.. ఆ రోజుల్లో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించామని చెప్పారు.
అమ్మ చెప్పిన మాటలే ధైర్యాన్నిచ్చాయి:
ఈ సుదీర్ఘమైన పోరాటంలో తనకు ఎంతో అనుభవం వచ్చిందని వెంకట్ పేర్కొన్నారు. "జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు.. చివరికి అంతా మంచే జరుగుతుంది, ఒకవేళ ఇంకా మంచి జరగలేదంటే అది ముగింపు కాదు అని. ఆ మాటలే నాకు ఈ క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి" అని ఆయన పంచుకున్నారు.
ప్రజల తీర్పుతో వస్తున్న 'జన నాయకుడు':
ఎన్నో అడ్డంకులు, సెన్సార్ ఆలస్యాలను దాటుకుని చివరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంపై ప్రొడ్యూసర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రజలందరూ ఇప్పటికే విజయ్ గారిని 'జన నాయకుడు' అని గుండెల్లో పెట్టుకుని తీర్పు ఇచ్చేశారని, అందుకే ఇప్పుడు ఆ జన నాయకుడు థియేటర్లలోకి వస్తున్నాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్:
ఇక భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వరుస బిగ్ ప్రాజెక్ట్స్‌తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. తలపతి విజయ్‌తో 'జన నాయకుడు' సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించిన ఈ బ్యానర్, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అందులో యష్ సినిమా కూడ వుంది. ఇక రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాను కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
సినిమా నిర్మాణం కంటే సెన్సార్ ప్రక్రియే పెద్ద సవాల్ అయిందని నిర్మాత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఏది ఏమైనా అన్ని అడ్డంకులను అధిగమించి వస్తున్న 'జన నాయాగన్' వెండితెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.