• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఘట్టమనేని వారసుడి నోట...

ఘట్టమనేని వారసుడి నోట మెగా హీరో పేరు.. వైరల‌వుతున్న కామెంట్స్!

| ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో నటుల మధ్య పరస్పర గౌరవం, ఒకరి పనిని మరొకరు ప్రశంసించే సంస్కృతి మరింత బలపడుతోంది.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-07-22 15:33 GMT

సినీ పరిశ్రమలో స్టార్ కుటుంబాల మధ్య పోలికలు, అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ చర్చనీయాంశాలే. అయితే అప్పుడప్పుడు వచ్చే కొన్ని కామెంట్స్ ఆ డిస్క‌ష‌న్ ను పూర్తిగా భిన్న దిశలోకి తీసుకెళ్తాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న జ‌య‌ కృష్ణ ఇటీవల తన ఫ్యామిలీలో కాకుండా బ‌యటి హీరోల్లో త‌న‌కు ఇష్ట‌మైన హీరో రామ్ చరణ్ అని చెప్పడం అలాంటి సందర్భంగానే కనిపిస్తోంది. ఈ కామెంట్ జ‌య కృష్ణ ప‌ర్స‌న‌ల్ అయిన‌ప్ప‌టికీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిని ఘట్టమనేని, మెగా అభిమానుల మధ్య సానుకూల అనుబంధానికి సంకేతంగా చాలామంది అభివర్ణిస్తున్నారు.

 

సాధారణంగా ఫ్యాన్ బేస్‌ల మధ్య పోలికలు, రికార్డ్స్ కు సంబంధించిన డిస్క‌ష‌న్స్ ఎక్కువగా కనిపించే టాలీవుడ్‌లో, ఒక స్టార్ కుటుంబానికి చెందిన కొత్త హీరో మరో బ‌డా ఫ్యామిలీకి చెందిన స్టార్‌ను ప్రశంసించడం కొత్త తరహా చర్చకు దారి తీసింది. దాంతో పాటూ సినిమా ఇండస్ట్రీలోకి వ‌చ్చి సినిమాలు చేయ‌డ‌మే గొప్ప విష‌య‌మైతే, ఇండ‌స్ట్రీలోకి వచ్చి స్టార్‌గా ఎదగడం ఇంకా గొప్ప విషయ‌మ‌ని జ‌య కృష్ణ చెప్పాడు.

ఈ మాటల్లో ఒక కొత్త నటుడి దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. స్టార్‌డమ్ అనేది కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తో లేదా ఫ్యాన్స్ మద్దతుతో మాత్రమే సాధ్యమయ్యేది కాదని, దాని వెనుక సంవత్సరాల పాటు కొనసాగే కష్టం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటాయని జ‌య కృష్ణ కామెంట్స్ ఇన్‌డైరెక్ట్ గా గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా నేటి పాన్ ఇండియా పోటీ వాతావరణంలో ప్రతి సినిమా కొత్త పరీక్షగా మారుతున్న సమయంలో, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న నటుల ప్రయాణాన్ని గౌరవించడం పరిశ్రమలో ఆరోగ్యకరమైన దృక్పథంగా భావించవచ్చు. రామ్ చరణ్‌ను అభిమాన హీరోగా పేర్కొంటూనే స్టార్‌డమ్ విలువను ప్రత్యేకంగా ప్రస్తావించడం అదే విష‌యాన్ని బలపరుస్తోంది.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో నటుల మధ్య పరస్పర గౌరవం, ఒకరి పనిని మరొకరు ప్రశంసించే సంస్కృతి మరింత బలపడుతోంది. అలాంటి సమయంలో కెరీర్ ప్రారంభ దశలో ఉన్న జ‌య‌ కృష్ణ చేసిన కామెంట్స్ కూడా అదే దిశగా కనిపిస్తున్నాయి. ఆడియ‌న్స్ దృష్టిలో ఇలాంటి మాటలు కేవలం ఫేవరెట్ హీరో ఎంపికగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశంగా కూడా మారుతున్నాయి. సోషల్ మీడియా యుగంలో ప్రతి విష‌యం క్షణాల్లో వైరలవుతున్న‌ నేపథ్యంలో, ఫ్యాన్స్ మధ్య విభేదాల కంటే పరస్పర గౌరవానికి ప్రాధాన్య‌మిచ్చే సందేశాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. రామ్ చరణ్‌పై జ‌య‌ కృష్ణ వ్యక్తం చేసిన అభిమానం కూడా అలాంటి సానుకూల చర్చకు కారణమవుతుండగా, కొత్త తరం హీరోలు పోటీతో పాటు పరస్పర గౌరవాన్ని కూడా సమాన‌ విలువైనదిగా చూస్తున్నారనే సంకేతంగా ఈ పరిణామాన్ని చూడొచ్చు.

Tags:    
  • jayakrishna 
  • ramcharan 
  • ghattamanenifamily 
  • megafamily 
  • tollywood 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS