బాలకృష్ణ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. డయాగ్నస్టిక్ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత ఆయన చికిత్సకు సంబంధించిన తుది ప్రణాళికను విడుదల చేస్తాము.
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ బృందం బులెటిన్ విడుదల చేసింది. ఈ మేరకు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ ఎడమ మోకాలిని పరీక్షించిన తర్వాత ఆయన మోకాలి చుట్టూ ఉండే కణజాలాలలో రక్తం గడ్డ కట్టుకు పోయింది. అలాగే తీవ్రమైన వాపు వచ్చినట్లు పరీక్షలలో తేలింది. ఇది మజిల్ టేర్ ను సూచిస్తుంది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో విస్తృతమైన క్లినికల్ డయాగ్నస్టిక్ పరీక్షలు ఆయనకు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని.. ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితమైన చికిత్స అందించడానికి.. వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ వైద్య బృందాన్ని కూడా రంగంలోకి దించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. డయాగ్నస్టిక్ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత ఆయన చికిత్సకు సంబంధించిన తుది ప్రణాళికను విడుదల చేస్తాము. ఇక ఎప్పటికప్పుడు ఆయన వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటాము. ఎవరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అంటూ వైద్య బృందం వెల్లడించింది.
ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనే టార్గెట్ తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసే పనుల్లో పడ్డారు. అందులో భాగంగానే తాజాగా కీలక షెడ్యూల్ ని కాకినాడ పోర్ట్ సమీపంలో నిర్వహిస్తున్నారు. బాలయ్య పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. బాలయ్య యాక్షన్ స్టంట్ చేస్తున్న సమయంలో సడన్ గా కాలుజారి కింద పడ్డారు. ఇక వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం ఆయనను కాకినాడలోని స్థానిక హాస్పిటల్ కి తరలించి.. ప్రాథమిక చికిత్సను అందించారు. మెరుగైన వైద్య పరీక్షల కోసం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ కి తరలించడం జరిగింది . ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వైద్యులు ఈ మేరకు తాజాగా బులెటిన్ విడుదల చేశారు
బాలకృష్ణ నటిస్తున్న NBK 111 సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో భగవంత్ కేసరి సినిమా వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా బాలయ్య రెండవసారి సినిమా చేస్తున్నారు. గతంలో వీరసింహారెడ్డి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు ఈ కాంబినేషన్. ఇక ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నారు. దీనికి కార్పెంటర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.