టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికినట్టేనా?
దీంతో ప్రస్తుతం ఎంతో మంది టాలీవుడ్ దర్శకులు.. ఇప్పుడు తమ పెన్నుకు పదును పెట్టి సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.;
ప్రస్తుతం కంటెంట్ ఉంటే చాలు.. క్యాస్టింగ్, బడ్జెట్ సహా మిగతా అంశాలతో సంబంధం లేకుండా సినిమాలను హిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కచ్చితంగా మూవీలో కంటెంట్ ఆకట్టుకునే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో దర్శకులు రాసుకున్న స్టోరీలు, స్క్రిప్టులపై దాదాపు మూవీ రిజల్ట్ లు ఆధారపడుతున్నాయి. తమ టాలెంట్ తో ఆడియన్స్ ను మెప్పిస్తేనే.. సక్సెస్ లు దక్కుతాయి.
దీంతో ప్రస్తుతం ఎంతో మంది టాలీవుడ్ దర్శకులు.. ఇప్పుడు తమ పెన్నుకు పదును పెట్టి సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలో దర్శకుడిగా తెలుగు డెబ్యూ మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా ఓ టాప్ తెలుగు హీరోకు ఆయన స్టోరీ వినిపించారని తెలుస్తోంది. నెరేషన్ కూడా పూర్తయిందని సమాచారం. ప్రాజెక్టు దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకుందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికినట్టేనని మూవీ లవర్స్, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
నిజానికి.. పృథ్వీరాజ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన యాక్టింగ్. మాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నప్పటికీ, భాషలతో సంబంధం లేకుండా హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ నటించిన సలార్ లో ఆయన పోషించిన విలన్ రోల్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి చిత్రంలో కూడా కీలక పాత్ర కుంభగా కనిపించనున్నారు.
అయితే, నటుడిగానే కాదు.. దర్శకుడిగా కూడా పృథ్వీరాజ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2019లో వచ్చిన లూసిఫర్ మూవీగా డైరెక్టర్ గా అరంగేట్రం చేసి, తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా మలయాళంలో భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత బ్రో డాడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించి మరోసారి తన మేకింగ్ స్టైల్ చూపించారు.
గత ఏడాది ఎల్2: ఎంపురాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విమర్శకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ అందుకున్నా.. ఆ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే స్టోరీపై గ్రిప్, స్టైలిష్ టేకింగ్, మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్ తో మూవీ తీయడం పృథ్వీరాజ్ స్పెషాలిటీ! అలాంటి దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేస్తే.. కొత్త తరహా స్టోరీస్, విజువల్ ట్రీట్ చూసే అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి చూడాలి.. ఏం జరుగుతుందో..