వారణాసి మూవీ బడ్జెట్ షాకింగ్ రేంజ్!

అయితే వారణాసి బడ్జెట్ గురించి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.;

Update: 2026-02-12 05:41 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా ఆయన రూపొందిస్తుండగా.. వచ్చే ఏడాది సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. సమ్మర్ కానుకగా 2027 ఏప్రిల్ 7వ తేదీన పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే వారణాసి బడ్జెట్ గురించి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దానిపై అధికారికంగా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మూవీకి ప్లాన్ చేస్తున్న స్కేల్, టెక్నికల్ వాల్యూస్, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్ చూసినప్పుడు ఆ నెంబర్.. నిజమయ్యి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు నేషనల్ వైడ్ గానే కాకుండా.. వరల్డ్ వైడ్ గా కూడా భారీ విజయాలు సాధించాయి. ఈసారి మరింత గ్రాండ్ విజన్‌ తో జక్కన్న వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబును నెవ్వర్ బిఫోర్ అనేలా కొత్త లుక్‌ లో చూపించేందుకు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారట.

యాక్షన్ ఎపిసోడ్లు, అడ్వెంచర్ సీక్వెన్స్లు, భారీ సెట్లు, ఫారెన్ లొకేషన్లు.. అన్నీ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. గ్లోబల్ మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని ఆమెను సెలెక్ట్ చేసినట్లు టాక్. అంతేకాకుండా పలువురు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌ లు ప్రాజెక్ట్‌ లో భాగమవుతున్నారని తెలుస్తోంది.

దీంతో ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో షూటింగ్‌ ను షెడ్యూళ్ల రూపంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారట జక్కన్న. కేవలం సెట్స్ నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్, మార్కెటింగ్ కూడా గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేయడం వల్ల ఖర్చు భారీగా పెరగనుందని అంచనా. దీంతో వారణాసి మూవీ ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని చెప్పాలి.

Tags:    

Similar News